చైతన్యం పేరిట పోలీసుల చేతివాటం

సుల్తానాబాద్‌,జూన్‌25(జనంసాక్షి) :
పోలీసులు ప్రజలతో మమైకంగా ఉండాలని ఆశయంతో ప్రజలను చైతన్యవంతం చేసేందుకు సహజ దోరణిలో మూడనమ్మకాలపై, గుడుండా నియంత్రణపై ప్రజలను చైతన్యపర్చే మంచి మార్గంలో ఉండాలని ఆశయంతో శ్రీరాంపూర్‌ పోలీసులు కూనారం గ్రామంలో రాత్రి నిర్వ హించిన అవగాహన సదస్సు అదుపు తప్పి గ్రామస్థులు,ప్రజాప్రతినిధులపాలిట శాపంగా మారింది. అడ్డుచెప్పిన ప్రజాప్రతినిధులను చితక బాదిన పోలిస్‌మార్‌ చైతన్యాన్ని నింపారు. ప్రజా ప్రతినిధులు,మహిళలు అని చూడకుండా స్థానిక ఎస్సై జివి.కృష్ణరెడ్డి తన సిబ్బందితో చితకబాది నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వారిని న్యాయం కావాలంటూ సోమవారం సుల్తానాబాద్‌ లోని రాజీవ్‌రహదారిపై రాస్తారోకో చేస్తూ సంఘటనకు బాధ్యుడైన ఎస్సైని సస్పెండ్‌ చేయాలంటూ నినాదాలు చేసారు. కూనారం గ్రామమాజీఎంపీటీసీ రవి భుజానికి గాయాలు కాగా రాజయ్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరి కొందరి మహిళలు గాయాలు పడ్డారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదంటూ స్థానిక ఎస్సై జగదీశ్‌తో వాగ్వివాదానికి దిగారు. ఎస్సై జగదీశ్‌ ఆందోళనను విరమింప జేసారు. సుల్తానాబాద్‌ సీఐకికరుణాకర్‌రావుకు ఎస్సైపై ఫిర్యాదు చేసారు. ఈవిషయంపై పూర్తి నివేదిక తెలుసుకున్నాక దర్యాప్తు చేసాక చర్యలు తీసుకంటామని ఆయన తెలిపారు. శ్రీరాంపూర్‌ మండలం సీఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ పాండు రంగడు కు తీవ్రగాయలయ్యాయని ఇతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐకరుణాకర్‌రావు తెలిపారు. ఈఆందోళన కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌నాయకులు వైకుంర Äపతి, డొంకెనరవి, నారాయణ, మాజీఎంపీటీసీ రవి, మాజీసర్పంచ్‌ నిర్మల, కొమురమ్మ, కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు.