హుస్సేన్‌నగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా తినేటి జీవన్ ఎంపిక

సిరికొండ, జూలై 24 (జనం సాక్షి):నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి ఆశీస్సులతో, హుస్సేన్‌నగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో తినేటి జీవన్ గ్రామ కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తినేటి జీవన్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి, పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు.
గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.



