కల్లెడ బీపీఎం బాల్నే రాజుకు ‘డివిజన్ ఎక్స్‌లెన్స్’ అవార్డు

పర్వతగిరి, జూలై 24: (జనం సాక్షి) పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (PLI), రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (RPLI) పాలసీలను రికార్డు స్థాయిలో చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM) బాల్నే రాజును ‘డివిజన్ ఎక్స్‌లెన్స్’ అవార్డు వరుసగా మూడవ సారి వరించింది.వరంగల్ డివిజన్ పరిధిలో అత్యధిక పాలసీలు చేసినందుకు గాను ఆయనకు వరంగల్ జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ రవికుమార్ చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రవికుమార్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ బీమా పథకాలపై అవగాహన కల్పిస్తూ, రికార్డు స్థాయిలో పాలసీలు చేయించడం అభినందనీయమన్నారు. బాల్నే రాజు సేవలని మిగతా సిబ్బంది ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో నార్త్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ సైదానాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్స్ (ASP) వరప్రసాద్, నర్సంపేట ఐపీ సూచిందర్, తొర్రూరు ఐపీ విద్యాసాగర్‌తో పాటు పలువురు పోస్టల్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తమ మండలానికి చెందిన బీపీఎం అవార్డు అందుకోవడం పట్ల మండల నాయకులు కల్లెడ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.



