గంభీరావుపేట మండల కేంద్రంలో కేటీఆర్ జన్మదిన సందర్భంగా మెగా హెల్త్ క్యాంప్

గంభీరావుపేట జూలై 24 (జనం సాక్షి); గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని చేరాల నిహారిక నిఖిల్ గౌడ్ ఆధ్వర్యంలో నాస్కప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు చేతుల మీదుగా మెగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు అందించారు అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు నిహారిక ,వెంకట్ స్వామి గౌడ్ మాట్లాడుతూ, కేటీఆర్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య బృందం మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

తాజావార్తలు