విద్యార్థులపై లాఠీచార్జీని ఖండిస్తూ….హయత్‌నగర్‌లో కొవ్వొత్తుల ర్యాలీ

హయత్‌నగర్, జూలై 23 (జనం సాక్షి) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ జరిపిన ఘటనను ఖండిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ హయత్‌నగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న నాయకులు విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఐ ఎల్‌బీ నగర్ నియోజకవర్గ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు సామిడి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై లాఠీచార్జీకి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ హయత్‌నగర్ మండల కార్యదర్శి శేషరాజుపల్లి శ్రీదేవి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సామిడి వంశీ వర్ధన్ రెడ్డి, సహాయ కార్యదర్శి మర్రి శోభన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఐ. వెంకటేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు చెంది రాము, మండల కార్యదర్శి గోల్కొండ నాగరాజు, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ మండల అధ్యక్షురాలు చెంది సుమతి, మండల కార్యదర్శి కుంచాల సౌజన్య, బీఓసీ నాయకుడు శ్రీను సామేలు, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు యనమల్ల శ్రీకాంత్‌తో పాటు సౌజన్య, అనిత, ఆదిలక్ష్మి, కృష్ణలీల, పాల్వాయి సురేందర్, జి. చంటి, వీరాస్వామి తదితర నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొని ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపారు.

తాజావార్తలు