భీంగల్ పట్టణం కప్పల వాగులోకి వెంటనే నీటిని వదలండి

 

👉 ప్రభుత్వానికి బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి.

👉 21 ప్యాకేజీ ద్వారా మెంట్రాజ్ పల్లి నుండి భీంగల్ కప్పల వాగులోకి నీటిని వదలండి.

👉 ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని విచారణ.

భీంగల్ టౌన్,జులై 22(జనం సాక్షి):ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు,గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క,విద్యాశాఖ సెక్రెటరి ఐఏఎస్ యోగితా రానా పర్యవేక్షణలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేస్తూ,తనకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్లే ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు.అలాగే నిజామాబాదు జిల్లా రైతులు పడుతున్న బాధలను దృష్టిలో ప్రస్తుతం నిర్వహిస్తున్న జిల్లా సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవలసిందిగా సూచనలు చేశారు.ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 15 టీఎంసిల నీరు నిల్వ ఉందని ఈ నీటిని వరద కాలువలకు-0.50 టీఎంసి,కాకతీయ కెనాలు కు-0.50 టీఎంసి,లక్ష్మీ కెనాలు కు-0.50 టీఎంసి,మెంట్రాజ్ పల్లి పంపు హౌజ్ కు-0.50 టీఎంసి,(పంపు హౌజ్ నుండి పెద్ద వాగు,దాని నుండి భీంగల్ పట్టణంలోని కప్పల వాగుకు),గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్ కు-2.0 టీఎంసి లు(దాని నుండి చెరువులకు),మొత్తం 4 టీఎంసి ల నీటిని విడుదల చేయాలని కోరుతూ,ఇలా నీటిని విడుదల చేసిన కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో 11 టీఎంసి ల నీరు నిల్వ ఉంటుందని తెలియచేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,రైతులకు విద్యుత్ తగినంత సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు వారికి పంట పొలాల్లో 11 నుండి 14 గంటల విద్యుత్ మాత్రమే అందుతుందని వాపోయారు.గత ప్రభుత్వ 24 గంటల ఉచిత విద్యుత్ విధానం లో భాగంగా రైతుల పంట పొలాలకు నిరంతరాయ 18 గంటల విద్యుత్ అందించాలని కోరారు.అంతిమంగా ప్రభుత్వం బేషజాలకు పోకుండా….ప్రాణహిత ద్వారా గోదావరిలో కాళేశ్వరం దగ్గర నుండి వృధాగా సముద్రలోకి పోతున్న నీటిని కన్నెపల్లి పంపు హౌజ్ మోటార్ల ద్వారా ఎత్తిపోసి, ఆ నీటిని వరద కాలువలో పోసి….రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ని నింపి,నిజామాబాద్,ఆదిలాబాద్, కరీంనగర్ రైతులకు సాగు నీటి కొరత లేకుండా చూడాలని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.