భీంగల్ పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ శ్రేణులు

భీంగల్ టౌన్,జులై 24 (జనం సాక్షి) భీంగల్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కనికరం మధు ఆధ్వర్యంలో, బీజేపీ నాయకులు,కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్బంగా కనికరం మధు మాట్లాడుతూ, ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసన కార్యక్రమాల పై బీజేపీ పార్టీ తరపున తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.కాంగ్రెస్, తృణమల్ కాంగ్రెస్,ఆమ్ ఆద్మీ తదితర ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ,నీట్ పేపర్ లీకేజీ అంశాన్ని అడ్డం పెట్టుకొని విద్యార్థులను తప్పుతోవ పట్టిస్తున్నారని అలాగే ఈ అంశాన్ని వారి స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ,దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర నాయకత్వాన్ని,బీజేపీ పార్టీ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు యోగేశ్వర్ నర్సయ్య,పట్టణ ప్రధాన కార్యదర్శులు నవీన్, దయ ప్రవీన్,పట్టణ ఉపాధ్యక్షులు నవీన్,రైతు మోర్చా అధ్యక్షులు నీలం గంగాధర్,తోట గంగాధర్,పట్టణ ఉపాధ్యక్షుడు మహేందర్,సీనియర్ నాయకులు నాగార్జున రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు శెట్టి ప్రేమ్ చంద్,బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు అజయ్, సీనియర్ నాయకులు హరి ప్రసాద్,చిన్ని నరసయ్య, పతాని ప్రవీణ్, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

తాజావార్తలు