ఛార్జీల పెంపుతో నిలువు దోపీడీ నారాయణ

 

హైదరాబాద్‌ పెంచిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ డీమాండ్‌ చేశారు. బస్సు ఛార్జీల పెంపునకు నిరసనగా అర్టీసీ క్రాస్‌ రోడ్స్‌కు సమీపంలోఉన్న బస్‌ భవన్‌ ఎదుట సీపీఐ అందోళనకు దిగింది. ఈ కార్యక్రమంలో పాల్గోన నారాయణ మాట్లాడుతూ ఛార్జీల పెంపుతో ప్రభుత్వం ప్రజలను నిలువు దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ఛార్జీల పెంపుపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.