ఛైర్మన్, సభ్యులను వెంటనే నియమించాలి
బాగ్‌లింగంపల్లి: రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమిషన్లకు ఛైర్మన్, సభ్యులను వెంటనే నియమించాలని పలువురు వక్తలు కోరారు. శుక్రవారం సుందరయ్య కళాభవన్‌లో దళిత బహుజన్ ఫ్రంట్, దళిత బహుజన మహిళ సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు వినయ్‌కుమార్, కేవీపీఎన్ రాష్ట్ర నేత సాగర్, అమన్ వేదిక మహిళ నాయకురాలు ఇందిర కేతన తదితర నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్సీ ఫెనాన్స్ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ. 500 కోట్ల కేటాయించాలని డిమాండ్ చేశారు.