జగన్‌కు రిమాండ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్‌: సీబీఐ కోర్టు ఈనెల 25 వరకు జగన్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగించింది.నేటితో జగన్‌ రిమాండ్‌ ముగియడంతో అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో  జగన్‌ను హాజరుపరిచారు. కోర్టులో సీబీఐ పిటిషన్‌ నార్కో పరీక్షకు  జగన్‌ను అనుమతించాలని దాఖలు చేసింది. చంచల్‌గూడ్‌ జైలు నుంచి కోర్టుకు తనను వ్యాన్‌లో తరలించడంపై జగన్‌ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు.