‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక’

హైదరాబాద్‌: రాష్ట్రంలో ‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలియజేశారు.జలయజ్ఞంపై  మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పర్యావరణ, అటవీశాఖ అనుమతుల జాప్యంతో కొన్ని ప్రాజెక్టుల ద్వారా నీరు ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. భేటీలో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, గీతారెడ్డిలు పాల్గొన్నారు.