జాతీయస్థాయి సైకిల్‌ పోలో పోటీలకు ఎంపిక

మంచిర్యాలక్రీడావిభాగం (జనంసాక్షి), బీహర్‌ రాష్ట్రంలోని ఆరా జిల్లాలో నవంబర్‌ 2నుంచి 7 వరకు జరిగే జాతీయస్థాయి సైకిల్‌పోలో పోటీలకు మంచిర్యాల గిరిజన ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థినులు అనసూయ,

రవళికలు ఎంపికైనట్లు ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్‌లింగం, పీడీ జీవరత్నంలు తెలిపారు ఈనెల 12 నుంచి 15 వరకు హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో ప్రతిభ చూపిన అనసూయ రవళికలు రాష్ట్రజట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నట్లు వారు పేర్కొన్నారు.