జాతీయ బాలల దినోత్సవంగా 15 ఏండ్ల లోపు పిల్లలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
హైదరాబాద్ : జాతీయ బాలల దినోత్సవంగా రాష్ట్రంలోని పిల్లలందరికీ టీఎస్ ఆర్టీసీ కానుక అందించింది. 15 ఏండ్ల లోపు వయసున్న పిల్లలందరూ ఆదివారం అర్ధరాత్రి 12 గంటల వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. పిల్లలకు ఇవాళ ఉచిత ప్రయాణం కల్పిస్తూ టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఒక్కరోజు ఏ బస్సులోనూ పిల్లలకు టికెట్ అవసరం లేదని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.