జిల్లాలో 45వేల మంది బడీడు పిల్లలను పాఠశాలలో చేర్చుట లక్ష్యం

-అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అబ్నార్‌
జిల్లాలో ఐదు సంవత్సరాలు దాటిన 45వేల మంది బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుట లక్ష్యంగా నిర్ణయించినట్లు అదనపు జాయింట్‌ కలెక్టర్‌ సుందర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల పేర్లు నమోదు సీజనల్‌ వ్యాధులపై ముదు జాగ్రత్త చర్యలపై మండల స్పెషల్‌ ఆఫీసర్‌ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవఙ్ఞులైన టీచర్లు పక్కా పాఠశాల భవనాలు ఉచితపు స్తకాలు ఆహ్లాదకరమైన వాతావరణం అన్ని మౌలిక వసతుల కల్పన మధ్యాహ్న భోజనం రెండు జతల స్కూల్‌ డ్రెస్‌ లు పంపిణీ చేస్తూ నాణ్యమైన విద్యను అందించుటకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలి పారు. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల పనితీరున తల్లిదండ్రులకు వివరిస్తూ వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించుటకు ప్రోత్సహించాలని సూచించారు. ఇది వరకే ప్రైవేట్‌ పిల్లలను సైతం తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. వీలైతే  అడ్మిషన్‌ రోజే పిల్లలకు పుస్తకాలు స్కూల్‌ డ్రెస్స్‌ లు అందించాలని అన్నారు.ఉపాధ్యాయులు ఆప్యాయత అనురాగాలతో ఉంటూ స్కూల్‌ నిధుల నుండి చాక్లెట్‌ లాంటివి అందించి ఉత్తేజపరచాలని సూచించారు.పాఠశాలకురాని వారిని ఇంటికి వెళ్లి తీసుకురావాలని ఇంతవరకు 21వేలమంది చేరారని 45వేల లక్ష్యాన్ని అధిగమించుటకు కృషి చేయాలని అన్నారు.వర్షాకాలంలో గ్రామాలలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.దోమల నివారణకు స్ప్రే చేయించాలని పరిసరాలను పరిశుభ్రంగా  ఉంచుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. అంటువ్యాధులు సోకినట్లు గుర్తిస్తే అధికారులకు తెలపాలని సూచించారు.