జిల్లా సాంస్కృతీ క్రీడోత్సవాలు

ఏలూరు, జూలై 28 : జిల్లా స్థాయి గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సాంస్కృతిక క్రీడోత్సవాలు రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఇండోర్‌ స్టేడియంలో షటిల్‌, బ్యాట్‌మెంట్‌, క్యారమ్స్‌, తదితర క్రీడల కార్యక్రమాల్లో గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ, ఉద్యోగుల్లో శారీరక, మానసిక ఉల్లాసం పెంపొందించేందుకు క్రీడలు చాలా అవసరమని ప్రతి ఉద్యోగి ఉదయం లేవగానే వ్యాయామం చేసి సాయంత్ర సమయాలలో క్రీడల్లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉండి తమ జీవితాలను అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. డిఆర్‌డిఎ ఇందిరక్రాంతి పథం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగుల క్రీడోత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 29వ తేదీ ఆదివారం ఏలూరులో నిర్వహించనున్నట్లు రామకృష్ణ చెప్పారు. క్రీడలలో పాల్గొని విజయం సాధించిన విజేతలకు ప్రథమ, ద్వితీయ బహుమతులతో పాటు సర్టిఫికెట్లు కూడా ఉద్యోగులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ అధికారులు, పూర్ణచంద్రరావు, సూపరింటెండెంట్‌ కుమారస్వామి రాజా, వివిధ మండలాల్లో పనిచేస్తున్న డిఆర్‌డిఎ మహిళా ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు క్రీడలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.