జీవిత బీమా సంస్థకు ఫోరం ఆదేశం

శ్రీకాకుళం, జూలై 5 : బీమా పాలసీ కాలపరిమితిలో ఉండగా ఫిర్యాదికి ప్రమాదం జరిగిన కారణంగా పాలసీ సొమ్ములో కొంతభాగం చెల్లించారు. మిగిలిన పాలసీ సొమ్ము తక్షణమే ఫిర్యాదికి చెల్లించాలని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు పి.జగనాథరావు తీర్పు వెలువరించారు. జి.సిగడాం మండలం మర్రివలస గ్రామానికి చెందిన వివి రమణారావు జీవిత బీమా సంస్థలో జీవన సురభి పాలసీ తీసుకున్నారు. పాలసీ కాలపరిమితిలో ఉండగా ప్రమాదంలో ఆయనకు కాలు పోయింది. ప్రమాద బీమా లక్ష రూపాయలు చెల్లించాలని ఆయన కోరగా 75వేల రూపాయలు మాత్రమే చెల్లించారు. మిగిలిన సొమ్ము , పాలసీ ద్వారా రావాల్సిన ఇతర మొత్తాలను చెల్లించాలని న్యాయవాది బి.రామ్మోహనరావు ద్వారా ఆయన వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. దీనిపై పై విధంగా తీర్పు వెలువరించారు.