కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా?

` పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర
` కల్వకుర్తి లిఫ్ట్‌ ఎప్పుడు ఆన్‌ చేయాలో మాకు తెలుసు
` కాంగ్రెస్‌ పాలనలో రైతులు బాగుంటే ఓర్వలేకపోతున్నారా
` హరీశ్‌రావుపై మండిపడ్డ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి):నిరంతరం రాష్ట్రంలో రైతులను మోసం చేయాలని, రైతులను ఆందోళనకు గురి చేయాలని బీఆర్‌ఎస్‌ కుట్రలకు పాల్పడుతోంది. కుట్రపూరితమైన అబద్ధాలు ప్రచారాలు చేస్తోంది. అబద్ధాలను గోబెల్స్‌ కు మించి ప్రచారం చేయటం మాజీ మంత్రి హరీశ్‌రావుకు అలవాటైపోయింది. పంట వేసేటప్పుడు రైతులను ఆదుకునే ఆలోచన కాంగ్రెస్‌ ప్రభుత్వానిది. ప్రతి పంట సీజన్లో రైతులను ఆందోళనకు గురి చేసి, గందరగోళపరచాలనే దుర్భుద్ధి బీఆర్‌ఎస్‌ నేతలది. నిరుడు వానాకాలంతో పాటు ఇటీవలి యాసంగిలో భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారు. ఆ విషయాన్ని మరిచిపోయి హరీష్‌?రావు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. యాసంగి సీజన్‌ కు ముందు కూడా బీఆర్‌ఎస్‌ ఇలాంటి అబద్ధాలు మాట్లాడిరది. రైతులోకాన్ని ఆందోళనకు గురి చేయాలని అప్పుడు కూడా కుటిల ప్రయత్నాలు చేశారు. గత వానాకాలంలో రాష్ట్రంలోని రైతులు 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండిరచారు.యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులది. దేశ చరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సాధించిన రికార్డు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైంది. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా నిలిస్తే ఓర్వలేని గుణం బీఆర్‌ఎస్‌ లీడర్లది.పదేండ్లలో తాము చేసిన తప్పులు, దుర్మార్గాలకు ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. మేడిగడ్డ, కల్వకుర్తి అంటూ ఇప్పటికీ రైతులను మోసం చేయాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అసమర్థత, నిర్లక్ష్యం, నిర్వాకం కారణంగానే మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ఇప్పటికీ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాయి. సీకెంట్‌? ఫైల్స్‌ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ తప్పు బట్టింది. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అదే సీకెంట్‌ ఫైల్స్‌ పౌండేషన్‌ టెక్నాలజీతో నిర్మించటంతో ప్రమాదకరంగా మారాయి. అవి అక్కరకు రాని పరిస్థితిలోనే ఉన్నాయి. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కణ్నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్‌ చేసిన 160 టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదాట్లో పోసిన విషయం మరిచిపోయారా..? ఎన్డీఎస్‌ఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై తగిన నిర్ణయం తీసుకుంటుంది. హరీష్‌?రావు కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం మాకు లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గరి కన్నెపల్లి పంప్‌ హౌజ్‌? నుంచి నీటిని లిఫ్ట్‌ చేసి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్లకు నీటిని లిఫ్ట్‌ చేయాలి. ఆ మూడు బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానంతో, తప్పుడు డిజైన్లతో నిర్మించిన దుర్మార్గం గత ప్రభుత్వానిది. ఆ మూడు బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్డీఎస్‌ఏ హెచ్చరించింది. అయినా సరే, కన్నెపల్లి నుంచి నీటిని లిఫ్ట్‌ చేయాలని హరీష్‌?రావు పదే పదే మాట్లాడటం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే మంచితనం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్కరకు రాకుండా నిర్మించిన తమ అసమర్థతను కప్పి పుచ్చుకునేందుకు అబద్ధాలు వల్లించటం తప్ప, ప్రజల ప్రయోజనాలను బీఆర్‌?ఎస్‌? లీడర్లు మరిచిపోయారు. కల్వకుర్తి పంపులు ప్రతి ఏడాది జులై చివరిలో లేదా ఆగస్ట్‌ ఒకటో తేదీన స్విచాన్‌ చేసి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారు. ఈసారి కూడా అదే విధానం అమలవుతుంది. అందులో రైతులు సందేహించాల్సిన అవసరం లేదు. 2019లో ఆగస్ట్‌ 1%శ్రీ%, 2020లో ఆగస్ట్‌ 31, 2021లో ఆగస్ట్‌ 15న, 2022లో జులై 13న, 2023లో ఆగస్ట్‌ 6న కల్వకుర్తి లిఫ్ట్‌ లు ఆన్‌? చేశారు. గత ఏడాది జులై 27న స్విచాన్‌ చేశాం. రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టుల నీటిని ఎప్పుడు విడుదల చేయాలి. ఎంత ఆయకట్టుకు ఇవ్వాలి.. ఈసారి ఎంత సమర్థంగా వాడుకోవాలనేది ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలించటం వెనుక అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ ఇప్పటికే బయటపడ్డాయి. వాళ్ల హయంలోనే పోతిరెడ్డిపాడు కెపాసిటీ రెండిరతలకు మించి 88వేల క్యూసెక్కులకు పెంచుకున్నారు. రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌, ముచ్చుమర్రి నుంచి రోజుకు దాదాపు ఎనిమిది నుంచి పది టీఎంసీల నీటిని ఏపీ మళ్లించుకునే కుట్రలకు బీఆర్‌ఎస్‌ దొంగచాటుగా సహకరించింది. 2004 నుంచి 2014 వరకు ఏపీ అక్రమంగా 770 టీఎంసీలు కృష్ణా జలాలు తీసుకపోతే.. 2014 నుంచి 2023 వరకు బీఆర్‌ఎస్‌ పాలనలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 1225 టీఎంసీల నీళ్లు అక్రమంగా తీసుకుపోయినట్లు రికార్డులున్నాయి. బీఆర్‌ఎస్‌ పాలకులు తెలంగాణ ప్రయోజనాలను ఎలా తాకట్టుపెట్టారో తెలియజేసేందుకు ఇంతకు మించిన సాక్ష్యమేముంటుంది… ? ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్‌ లో, కృష్ణా బేసీన్‌ లో ఎక్కువ విస్తీర్ణంలో పంట లు సాగు చేసింది, ఎక్కువ సాగునీటిని వినియోగించింది, ఎక్కువ పంట పండిరచింది ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనే సాధ్యమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. వానాకాలం పంటలకు పెట్టుబడి సాయంగా రైతులకు అందించే ఆలోచన చేసింది మా ప్రభుత్వం. కేవలం 9 రోజుల రికార్డు వేగంతో రూ.9 వేల కోట్లు రైతు భరోసా పంపిణీ చేసిన ఘనత మాది. గతంలో బీఆర్‌ఎస్‌ ఎకరానికి రూ.5 వేల సాయం అందిస్తే.. ఎకరానికి మా ప్రభుత్వం రూ.6 వేల సాయం అందించింది. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేసింది. గతంతో పోలిస్తే సాగునీటి వనరులను వినియోగించటంలోనూ మా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం సమర్థవంతంగా పని చేసింది. రైతులకు ఆర్థికంగా భరోసా ఇవ్వటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. పంటల దిగుబడి రికార్డు స్థాయికి ఎదిగింది. పంట ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. అందుకే రైతు మేలు కోరే కార్యక్రమాలు చేపట్టడంలో మా ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం. ఇప్పటికైనా హరీశ్‌ రావు అబద్ధాలు మాట్లాడటం మానుకోవాలని హితవు పలుకుతున్నాం.