యువకుడిపై మూకుమ్మడి దాడి..!

ఆర్మూర్, జులై 3 ( జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని ఒక యువకుడిపై మూకుమ్మడి దాడి పలువురిని కలచివేస్తుంది.దాడి చేసి లక్ష ఖర్చు పెడితే ఖేల్ కతం దుకాణం బంద్ అంటూ కొట్టిన యువకుల వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.అసలేం జరిగింది.. ఆర్మూర్ పట్టణంలో రాత్రి వేళలో కొందరు యువకులు ఫుల్లుగా తాగి ఉన్నారు.అదే సమయంలో అక్కడే ఉన్న తన స్కూటీని తీసుకునేందుకు వచ్చిన యువకుడిని బండి మీద నుండి దిగాలని అడిగాడు.ఇక అంతే బూతు మాటలు,పిడి గుద్దులతో ఇష్టం వచ్చినట్లు చితకబాదారు.ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. సుమారు 20 మందిపైనే చచ్చి బ్రతికేలా కొట్టారు. అందులో ఒక యువకుడు స్కూటీ చాబిని తన పిడికిలి లో ఉంచి చాబితో పోట్లు పొడిచి, బ్రతికిమాలిన వదిలిపెట్టకుండా తీవ్రంగా దాడి చేశారు. దాడిలో గాయపడ్డ యువకుడు ఇంటికి చేరుకోగా,గంజాయి మత్త, తాగిన మైకమా తెలియదు గాని అదే గ్యాంగ్ ఇంటి మీదికి వెళ్లి ముకుమ్మడిగా మళ్లీ దాడి చేసి చితకబాదారు.ఇదే యువకులు గతంలో కూడా పక్క గ్రామానికి చెందిన యువకుడిని చెవిలోని కర్ణభేరి దెబ్బతినేలా చితక బాధితే నెలనరపాటు ఇంటి నుండి బయటకు వెళ్లలేక,లక్షలు ఖర్చుపెట్టి వారి కుటుంబ సభ్యులు అతనిని కాపాడుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.అయితే ఇలాంటి ఘటనలు అదే యువకులు కొట్టడం, గాయపరచడం,పోలీస్ స్టేషన్ దాకా వెళ్లి కాంప్రమైజ్ కావడం షరా మామూలే అన్నట్టు వ్యవహారం జరుగుతుంది.అకారణంగా తాగిన మైకంలో కొట్టడని చెప్పడం,తల్లిదండ్రుల భయం లేకపోవడం,సమాజంలోని కొందరు ఇలాంటి వారిని వెనుకేసుకుని రావడం వాళ్లే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.తల్లిదండ్రులు ఆశలన్నీ పుట్టి పెరిగి పిల్లల మీద పెట్టుకుంటే, సమాజంలో బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్న యువకులు చేతికి వచ్చిన పిల్లల్ని తల్లిదండ్రులకు కాకుండా చేస్తున్నారు.ఇలాంటివి డబ్బుందన్న పొగరుతో దాడి చేసిన యువకుల పై సిపి సార్ నిక్కచ్చిగా సరైన కేసులతో జైల్లో పెట్టి కటకటాల పాలు చేయాలని ఆర్మూర్ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.