జులై ఒకటి నుండి రైళ్ల వేళల్లో మార్పులు
హైదరాబాద్, జూన్ 27 : జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే విధంగా నిర్ధేశిత రైళ్ల వేళలు, రైళ్లు బయలుదేరే టెర్మినల్స్ విషయంలో స్వల్ప మార్పులు చేశారు. దేశవ్యాప్తంగా రైల్వే యంత్రాంగం చేపట్టిన మార్పులు చేర్పులలో భాగంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని రైళ్ల సమయాలను కూడా మార్పు చేశారు. మార్పులు జరిగిన రైళ్ల వివరాలను పరిశీలిస్తే… రైలు నంబర్ 12738 సికింద్రాబాద్-కాకినాడ గౌతమి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 21.15 గంటలకు బదులుగా సాయంత్రం 19.45 గంటలకు బయలుదేరుతుంది. కాకినాడ పోర్టుకు మరుసటి రోజు ఉదయం 07.30 గంటలకు బదులుగా 6.00 గంటలకు చేరుకుంటుంది. రైతు నంబర్ 17429 హైదరాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి సాయంత్రం 17.25 గంటలకు బదులుగా 15.35 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతికి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు బదులుగా 640 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్ 12732 సికింద్రాబాద్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి సాయంత్రం 1900 గంటలకు బదులుగా రాత్రి 20.05 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతికి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు బదులుగా ఉదయం 10.35 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్ 57305 కాచిగూడ-గుంటూరు ప్యాసింజర్ కాచిగూడ నుంచి సాయంత్రం 16.10 గంటలకు బదులుగా సాయంత్రం 15.30 గంటలకు బదులుగా సాయంత్రం 17.35 గంటలకు బయలుదేరుతుంది. రైలు నంబర్ 17415 తిరుపతి-కొల్లాపూర్ హరిప్రియ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి రాత్రి 20,30 గంటలకు బదులుగా రాత్రి 21.00 గంటలకు బయలుదేరుతుంది. కొల్లాపూర్‌కు మరుసటిరోజు సాయంత్రం 16.35 గంటలకు చేరుకుంటుంది. రైలు నంబర్ 12485 హెచ్ ఎస్ నాందేడ్- శ్రీ గంగానగర్ ఎక్స్‌ప్రెస్ హెచ్‌ఎస్ నాందెడ్ నుంచి రాత్రి 23.30 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది. శ్రీగంగానగర్‌కు రెండవ రోజుఉదయం 10.55 గంటలకు బదులుగా రాత్రి 22.40 గంటలకు చేరుకుంటుంది. రైళ్లు బయలుదేరు స్టేసన్, చేరుకొను స్టేషన్‌లో మార్పులను పరిశీలిస్తే… రైలు నంబర్ 57426 గుంతకల్-సికింద్రాబాద్ ప్యాసింజర్ సికింద్రాబాద్‌కు బదులుగా కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. రైలు నంబర్ 57473 సికింద్రాబాద్- బోధన్ ప్యాసింజర్ సికింద్రాబాద్‌కు బదులుగా కాచిగూడ నుంచి బయలుదేరుతుంది.