జూట్‌ మిల్లులో అగ్ని ప్రమాదం

విజయనగరం: పట్టణంలోని వీటి అగ్రహారంలో ఉన్న ఓ జూట్‌ మిల్లులో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగి భారీగా వ్యాపించాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు.