జె బి సి సి ఐ -11 వేతన సవరణ కమిటీ సమావేశం పెట్టాలి

 ఒప్పందం పూర్తి చేసి అమలు చేయాలి………..
కాంట్రాక్టు ల ద్వారా బొగ్గు ఉత్పత్తి లో నియంత్రణ ఉండాలి….. కాంట్రాక్టు కార్మికుల జీతాలు పెంచాలి…………………
బిఎమ్మెఎస్ నిర్ణయాలు…………….. ————————————————
గత రెండు రోజులుగా అనగా తేదీ 14&15.3.-2023 జార్ఖండ్ రాష్టంలొ దేవ్ఘర్ ఈసీఎల్ కోల్ ఫీల్డ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు ఏ బి కె ఎం ఎస్ అధ్యక్షులు టికేశ్వర్ సింగ్ రాథోడ్ అధ్యక్షతన బిఎమ్మెస్ కోల్ సెక్టార్ ఇంచార్జి కొత్త కాపు లక్ష్మ రెడ్డి మార్గదర్శనం లో ఏ బి కె ఎం ఎస్ ప్రధాన కార్యదర్శి సుధీర్ గురుడే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం లో జాతీయ బిఎమ్ఎస్ నాయకులు సురేంద్ర కుమార్ పాండే, ఏ బి కే ఎం ఎస్ పదాధికారులు, ఏ బి కె ఎం ఎస్ అనుబంధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి లు పాల్గొన్నారు. సింగరేణి నుండి పి. మాధవ నాయక్ ఏ బి కే ఎం ఎస్ కార్యదర్శి, టిఎస్ పవన్ కుమార్ ప్రధాన కార్యదర్శి సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్మికుల, పరిశ్రమల, భవిష్యత్తు స్థితిగతులు మరియు సంఘటనాత్మకమైన విషయాలు, ఎల్ 20 సదస్సు గురించి చర్చించి పలు తీర్మానాలు చేశారు.
తీర్మానాలు…..
1. జేబీసీసీఐ 11వ వేతన కమిటీ సమావేశాలు వెంటనే జరుపాలి* తేదీ 3-1-2023 న 8 వ సమావేశం కోల్కతా లో జరిగింది. ఈ సమావేశం లో 19% మినిమం గ్యారెంటీ బెన్ఫిట్స్ సాధించిన విషయం విధితమే, తదుపరి సమావేశం ఫిబ్రవరి లో నిర్వహించి మర్చి నాటికీ పూర్తి స్థాయి ఒప్పందం జరగాలి కానీ తదుపరి జేబీసీసీఐ కమిటీ 9వ సమావేశం ఇంతవరకు నిర్వహించకపోవడం యాజమాన్యం యొక్క నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ తదుపరి 9వ వె్జ్ బోర్డు సమావేశం వెంటనే నిర్వహించి పూర్తి స్థాయి ఒప్పందం జరగాలి లేని పక్షo లో బిఎమ్మెస్ తీవ్ర ఆందోళన చేస్తుందని కోల్ ఇండియా మరియు సింగరేణి యాజమాన్యం కు లిఖిత పూర్వకంగా తెలియచేయడం జరుగుతుంది అని తీర్మానం చేయడం జరిగింది.
2. కాంట్రాక్టీకరణ ద్వారా బొగ్గు ఉత్పత్తి పై నియంత్రణ ఉండాలి కోల్ ఇండియా మరియు సింగరేణి లో బొగ్గు ఉత్పత్తిలో 70% ఉత్పత్తి కాంట్రాక్టీకరణ ద్వారా జరుగుతుంది ఇది రోజురోజుకు పెరుగుతూ పోతుంది దీని కారణంగా శాశ్వత కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అంతేకాదు భవిష్యత్తులో ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుంది. కావున కాంట్రాక్టుల ద్వారా బొగ్గు ఉత్పత్తి పై నియంత్రణ ఉండాలి శాశ్వత కార్మికుల ద్వారా బొగ్గు ఉత్పత్తిని పెంచాలని తీర్మానం చేయడం జరిగినది.
3. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి: బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి బొగ్గు ఉత్పత్తిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కాంట్రాక్టు కార్మికులకు శ్రమకు తగిన వేతనం పొందడం లేదు కావున యాజమాన్యం శాశ్వత కార్మికుల మాదిరిగా కాంట్రాక్టు కార్మికుల వేతనాలను సవరణ కమిటీ వేసి చర్చించి శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. కాంట్రాక్టు కార్మికులకు ఈపీఎఫ్ కాకుండా సీఎం పిఎఫ్ లో వారి యొక్క ప్రావిడెంట్ ఫండ్ ను జమ చేయాలి ఇలా జమ చేయడం వలన కాంట్రాక్టు కార్మికులకు ఆరోగ్య భద్రత, పెన్షన్, సామాజిక భద్రత తదితర విషయాలలో శాశ్వత కార్మికులకు మాదిరిగా న్యాయం జరుగుతుంది. అంతేకాదు కాంటాక్ట్ కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి వారికి కూడా పెయిడ్ హాలిడే జీతాలు శాశ్వత కార్మికుల మాదిరిగా వర్తింపచేయాలి.అని తీర్మానం చేశారు