జేసీఐ ఫెమీనాకు 5 లవార్డులు

శ్రీకాకుళం, ఆగస్టు 2 : రాజమండ్రిలో జూనియర్‌ ఛాంబర్‌ ఇంటన్నేషనల్‌ జోన్‌-5 నిర్వహించిన మిడ్‌కాన్‌ సదస్సులో ‘సరదాగా ఒక రోజు’ కార్యక్రమంలో శ్రీకాకుళం జేసీఐ ఫెమీనాకు అయిదు అవార్డులు వచ్చినట్లు జేసీఐ ఫెమీనా అధ్యక్షురాలు పైడి రజనీగోపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. తాము చేసిన సేవలకు గాను అవుట్‌ స్టాండింగ్‌ పి.ఆర్‌.విన్నర్‌, కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ రన్నర్‌తో పాటు మరో మూడు అవార్డులు వచ్చినట్లు ఆమె చెప్పారు. ప్రజాపయోగకర కార్యక్రమాలు చేపట్టడమే తమ ధ్యేయమని ఆమె తెలిపారు.