టీ ట్వంటీ ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో యువరాజ్‌ హర్బజన్‌ కూ చోటు-రాయుడుకు సెల్టర్ల పిలుపు

ముంబై జూలై 18 :వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న ట్వంటీ ట్వంటీ ప్రపంచకప్‌ కోసం భారత జట్టు ప్రాబబుల్స్‌ను బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. 30 మంది జాబితాలో డాషింగ్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌కు చోటు దక్కింది. గత ఏడాది ప్రపంచకప్‌ తర్వాత యువీ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో జాతీయ జట్టుతో పాటు అటకూ దూరమ్యడు. ప్రాణాంతకమైన వ్యాదికి అమెరికా బోస్టన్‌లో చికిత్స తీసుకోని రెండు నెలల క్రితమే స్వదేశానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ ఇంకా సమయం ఉన్నందున అప్పటి వరకు సిద్దమవుతాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. అందుకే టీ ట్వంటీ ప్రపంచకప్‌ ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు. చీఫ్‌ సెలెక్టర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ యువీ రాకను స్వాగతిస్తున్నారు. ఈ లోపు జరిగే దేశవాళీ టోర్నిలలో యువీ ఆటతీరు సెలక్టర్లు పరిశీలించనున్నరు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడగలిగితే తుది 15 మంది జాబితాలో చోటు కల్పిస్తామని సెలక్టర్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే యువీతో పాటు హర్భజన్‌సింగ్‌ కూడా ఎంపికయ్యడు. చాలా కాలం జట్టులో చోటు కోల్పోయిన భజ్జీ శ్రీలంక టూర్‌కు సెలక్టర్లు పక్కన పెట్టారు. దీంతో టీ ట్వంటీ వరల్డ్‌కప్‌ కు కూడా అతను ఎంపిక కాకపోవచ్చని అంతా భావించారు. అయితే ప్రాబబుల్స్‌లో మాత్రం ఈ టర్బేనేటర్‌ చోటు దక్కించుకున్నాడు. మిగిలిన ఆటగాళ్ల ఎంపికలో చెప్పుకోదగిన విషయం అంబటి రాయుడుకు సెలక్టర్లు పిలుపునివ్వడం..ఇప్పటి వరకు జాతీయ జట్టు పిలుపు అందుకోని రాయుడు ఐపిఎల్‌ నాలుగు, ఐదో సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ తరపున అద్భుతంగా రాణించడం కలిసోచ్చింది. రాయుడుతో పాటు మరో దేశవాళీ క్రికెటర్‌ మణ్‌దీప్‌సింగ్‌ కూడా ఎంపికయ్యడు. మణ్‌దీప్‌సింగ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఫాస్ట్‌ బౌలర్‌ లక్ష్మిపతి బాలాజీ కూడా ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్నాడు. బాలాజీ చివరి సారిగా 2009లో శ్రిలంకపై ఆడారు. శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న టీ ట్వంటీ ప్రపంచకప్‌ కోసం తుది 15 మంది జాబితా ప్రకటించేదుకు ఆఖరు తేదీ ఆగష్ట్‌ 18 దీంతో ఆగష్ట్‌ రెండో వారంలో భారత తుది జాబితాను సెలక్టర్లు ఎంపిక చేయనున్నారు.టీ ట్వంటీ ప్రపంచకప్‌ భారత ప్రాబబుల్స్‌:మహేంద్రసింగ్‌ ధోని, వీరెంద్ర సెహ్వాగ్‌, గౌతం గంబీర్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, సురేష్‌ రైన, అశ్విన్‌, ప్రగ్యాన్‌ ఓజా, ఉమేశ్‌ యాదవ్‌, అశోక్‌ దిండా, అంజంక్యా రహానే, మనోజ్‌ తివారీ, రాహుల్‌శర్మ, వినయ్‌ కుమార్‌, జహీర్‌ఖాన్‌, యువరాజ్‌సింగ్‌, రాబిన్‌ ఊతప్ప, ఇర్ఫాన్‌ పఠాన్‌, యూసఫ్‌ పఠాన్‌, మణ్‌దీప్‌సింగ్‌, పియూష్‌ చావ్లా, రవీంద్ర జడేజా, శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, హర్భజన్‌ సింగ్‌, మునాఫ్‌ పటేల్‌, నమన్‌ ఓజా, దినేష్‌ కార్తీక్‌, ప్రవీణ్‌ కుమార్‌, లక్ష్మిపతి బాలాజీ.