టేక్మాల్ లో ఉచిత వైద్య శిబిరం..
టేక్మాల్ జనం సాక్షి సెప్టెంబర్ 1 టేక్మాల్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త నూతనముగా ప్రారంభిచబడిన శ్రీ సాయి లక్ష్మీ హాస్పిటల్లో 03-09-2022 శనివారం రోజున ఉ9గంల నుండి మ 2గంల వరకు ఉచిత వైద్య శిబిరం ఉన్నది. శిబిరంలో బి.పి. షుగర్, మొదలగు దీర్ఘ వ్యాధులతోపాటు సాధారణ జబ్బులన్నింటికీ మరియు చిన్నపిల్లలకు అనుభవజ్ఞులైన డాక్టర్ ప్రశాంత్ కస్తూరి ఎంబీబీఎస్ చే చికిత్స చేయబడును. డాక్టర్ పద్మ ఎంబిబిఎస్ డీజీవో (స్త్రీరోగ మరియు ప్రసూతి వైద్య నిపుణురాలు) చే స్త్రీ సంబంధిత జబ్బులకు, గర్భిణి స్త్రీలకు మరియు పిల్లలులేని దంపతులకు ఉచిత పరీక్షలు చేయబడును.
షుగర్ పరీక్షలు ఉచితముగా చేయబడును. అవసరమైన రక్త పరీక్షలు సగం ధరలకు చేయబడను.డా”ప్రశాంత్ కస్తూరి ఎంబిబిఎస్ డా” అనంత రెడ్డి, డా”పద్మ ఎంబిబిఎస్, డీజీవో మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ రెడ్డి టేక్మాల్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.