ట్విట్టర్‌లో స్టెఫానీ రైస్‌ హాట్‌ ఫోటో

సిడ్నీ: ఎవరు ఈ హాలీవుడ్‌ మోడల్‌ అనుకుంటున్నారా.. ఈమె మోడల్‌ కాదండి…ప్రముఖ స్విమ్మర్‌ స్టెఫానీ రైస్‌.. ఆస్ట్రేలియాకు చెందిన స్విమ్మింగ్‌ బ్యూటీ ఆట కంటే అందంతోనే ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. గత బీజింగ్‌ ఒలింపిక్స్‌ ముందు హాట్‌ హాట్‌ ఫోటో షూట్‌తో అందరినీ తన వైపు తిప్పుకున్న స్టెఫానీ తర్వాత ఆటలోనూ అదరగొట్టింది. మూడు స్వర్ణాలు కైవసం చేసుకుని రికార్డులు మోత మోగించింది. 2వందల మీటర్లు, 4వందల మీటర్ల వ్యక్తిగత ఈవెంట్లతో పాటు టీమ్‌ ఈవెంట్‌లోనూ సత్తా చాటింది. 2006 కామన్‌ వెల్త్‌ గేమ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన స్టెఫానీ తర్వాత బీజింగ్‌ ఒలింపిక్స్‌తో తిరుగులేని స్విమ్మర్‌ పేరిటే ఉంది. ఈ రేసు స్టెఫానీ 4నిమిసాల 29.45 సెకన్లలో పూర్తి చేసింది. అయితే ఏడాది కాలంగా ఆటకు దూరమైన ఈ బ్యూటీ ఇప్పుడు లండన్‌ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది. దీని కోసం ఆమె ఫుల్‌ ప్రిపరేషన్‌లో గడుపుతోంది. అయితే గత వారం తాను బికీనిలో ఉన్న ఫోటోను స్టెఫానీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి మళ్లీ వార్తల్లోకొచ్చింది. బీజింగ్‌ ఒలింపిక్స్‌ ముందు ఇలాగే హాట్‌ హాట్‌గా వార్తల్లో నిలిచిన స్టెఫానీ రైస్‌ మరోసారి అలాంటి సీనే రిపీట్‌ చేస్తోందంటే..లండన్‌ స్వర్ణాలు ఆమెవేనని అభిమానులు భావిస్తున్నారు.