ఢిల్లీ వెళ్లిన సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ఉదయం ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 28 జరగనున్న అఖిలపక్ష సమావేశంతో పాటు ధర్మన ప్రాసిక్యూషన్‌ ఫైల్‌ను గవర్నర్‌ తిరస్కరించిన నేపథ్యంలో ఈ అంశాలపై అధిష్ఠాన పెద్దలతో చర్చిస్తారని సమాచారం వీటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.