తక్కువ ఖర్చుతో ఎక్కువ సగయ్యే ప్రజెక్టు పాలమూరు: జైపాల్‌యాదవ్
హైదరాబాద్: పాలమూరు ప్రజెక్టు సర్వే కోసం రూ.10 కోట్లను మహబూబ్‌నగర్ జిల్లా ఇందిరమ్మబాటలో విడుదల చేయాలని జిల్లాకు చెందిన తెదేపా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డిని కోరారు. అలాగే జిల్లాల్లో నిలిచిపోయిన నెట్టెంపాడు, సోమా, కల్వకుర్తి లిప్టులను పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తేవాలని కోరారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే మూడు జిల్లాల్ల పదిలక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ సాగయ్యే ప్రాజెక్టుల్లో పాలమూరు ఒకటనే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని చెప్పారు.



