తడి – పొడి పద్దతిలో వరి సాగు -పద్మ పాని స్వచ్చంద సంస్థ ఆద్వర్యంలో రైతులకు అవగాహన
శంకరపట్నం: జనం సాక్షి మార్చి3
శంకరపట్నo మండల పరిధిలో శుక్రవారం.మొలంగుర్ రైతువేదిక లో ఏఓ శ్రీనివాస్ సమక్షంలో పద్మపాని స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యంలో రైతులకు తడి – పొడి పద్దతిలో వారి సాగు ఎలా చేయాలో అవగాహన కలిపించరు.
కోర్ కార్బన్ఎక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ &పద్మపాని స్వచ్ఛంద సంస్థ కో ఆర్డినేటర్ మధుకర్ రెడ్డి మాట్లాడుతూమారుతున్న వాతావరణ పరిస్థితుల వలన భూగర్భ జలాలపై ఒత్తిడి పెరగడం వల్ల వ్యవసాయంలో నీటి సమర్థ యాజమాన్య పరిస్థితులను పాటించడం ఎంతో ఆవశ్యకం ప్రపంచవ్యాప్తంగా సగం కంటే ఎక్కువ జనాభా ప్రధానంగా ఆహారంగా వాడే పంట వరి పండించటానికే ఎక్కువ మోతాదులో నీరు అవసరం . సంప్రదాయ పద్ధతిలో కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరం అవుతుంది . ఇది ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగం కంటే 2-3 రెట్లు అధికం కాబట్టి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదకత సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది . తక్కువ నీటి వినియోగంలో దిగుబడులు తగ్గకుండా వారిని పండించడానికి మరియు వాతావరణ పరిరక్షణకు కోర్ కార్బన్ఎక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సహకారంతో పద్మపాని స్వచ్ఛంద సంస్థ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో తడి – పొడి సాగు నీటి యాజమాన్యం అనగా క్రమంగా నీరు పెట్టడం మరియు ఆర బెట్టడం . ఈ పద్ధతిని అవలంభించటం ద్వారా 15-30 శాతం నీటి వినియోగం తగ్గడంతో పాటు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది అంతే కాకుండా వాతావరణనకు ప్రమాదకార కాలుష్య కారకమైన మిథేన్ వాయువు విడుదల కూడ ఈ పద్ధతిలో తగ్గుతుంది . ఈ విధానంలో వరిసాగు చేయటం ద్వారా వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది , చేను క్రింద పడిపోదు చీడ పీడలు ముఖ్యంగా దోమపోటు ఉధృతి తక్కువగా ఉంటుంది .
పొలంలో అమర్చుకునే నీటి గొట్టం నిర్మాణం :
ఈ పద్ధతిలో రంధ్రాలు ఉన్న ప్లాస్టిక్ గొట్టం వినియోగించి పొలంలో ఉండే నీటి మోతాదుని గుర్తించి అవసరమైన నీటిని ఇవ్వాలి . దీని కొరకు రైతులు ముందుగా ఒక అడుగు పొడవు 6 అంగుళాలు వ్యాసం ఉండే ప్లాస్టిక్ గొట్టంను తీసుకోవాలి గొట్టం అడుగు భాగం నుండి సగం ఎత్తువరకు చుట్టూ రంధ్రాలు 0.5 సెం.మీ పరిమాణంలో ఉండేలా ఏర్పాటు చేసుకోవాని రెండు రంధ్రాలు మధ్య 2 సెంటి మీటర్ల దూరం ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి . దీనిని అర అడుగు లోతు వరకు మట్టంను సూచిస్తుంది . గొట్టం రంధ్రాలు గుండా బయటికి , లోపలికి సులభంగా ప్రవహిస్తుంది . ఈ గొట్టాన్ని పొలం గట్లకి దగ్గరగా అమర్చుకోవడం వల్ల పర్యవేక్షణ సులభం అవుతుంది .
ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ దాసరి ప్రశాంత్, కెవికె శాస్త్రవేత్త శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ మెంబర్ సునీల్, ఏఇఓ శ్రావణి, ఎంపీటీసీ& రైతు సమన్వయ సమితి సభ్యులు సుభాష్ రెడ్డీ, ,ఉప సర్పంచ్ , రైతులు పాల్గొన్నారు.