రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి: డీజీపీ

హైదరాబాద్‌:రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్‌ డీజీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నేరాలు తగ్గాయని .కస్టోడియల్‌ డెత్‌లు పూర్తిగా అరికట్టగలిగామని చెప్పారు.మనుషుల అక్రమ రవాణా అరికట్టడంలో ఏపీఎస్పీకి కేంద్ర పురస్కారం లభించిందన్నారు.పోలీసు శాఖలో అవినీతి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్నారు.