తిరుగుబాటు సభను జయప్రదం చేయాలి

నర్సంపేట, మే 26(జనంసాక్షి) :
ఎమ్మార్పిఎస్‌ తిరుగుబాటు మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కల్లెపల్లి ప్రణయ్‌దీప్‌ మాదిగ పిలుపునిచ్చారు. శనివారం నర్సంపేట పట్టనంలోని ఎమ్మార్పిఎస్‌ అత్యావసర సమావేశాన్ని నిర్వహింంచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలను వర్గీకరణ చేయాలని డిమాండ్‌ చేశారు. గత 18 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం మంద కృష్ణ నాయకత్వంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.జూన్‌ 5న జరిగే మాదిగలతిరుగుబాటు రథయాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈసమావేశంలో ఆసంఘం నాయకులు తడుగుల విజయ్‌, ఐలయ్య, రవి, సదానందం, శోభన్‌బాబు, సాంబయ్య,మొగిళి, జంపయ్య, సారంగపాణి, భాస్కర్‌, విక్రమ్‌, సూరి, బాబు, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.