తిరుపతి రింగ్ రోడ్డుపై ఘోరం…

తిరుపతి జిల్లా నాయుడుపేటవద్ద నాయుడుపేట నుండి తిరుపతికి ఇటీవల కొత్తగా నిర్మించిన.. రింగ్ రోడ్డుపై.. నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది…

నాయుడుపేట రాజగోపాల్ పురానికి చెందిన.. ఓ కుటుంబం.. తిరుపతికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. నాయుడుపేట రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొనడంతో.. అందులో ప్రయాణిస్తున్న సొల్లేటి ప్రవీణ అనే మహిళ.. ఘటన స్థలంలోని మృతి చెందింది..మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు..
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..