తీన్మార్ మల్లన్న ( చింతపండు నవీన్ )పై దాడి,అరెస్ట్ దుర్మార్గం
*లిక్కర్ స్కామ్, పేపర్ లికేజీ లు వ్యవహారం క్యూ న్యూస్ ద్వారా ప్రజల్లో సామాజిక అవగాహనాకల్గుతుందనే భయం.
*దోపిడీలు, కబ్జాలు , దాడులే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర(బీఆర్ఎస్)ప్రభుత్వం -మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు.
ఏటూరునాగారం – జనం సాక్షి, మార్చి23.
ఈ రోజు ఏటూరునాగారం మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న మరియు మండల అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సందర్బంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు గారు మాట్లాడుతూ….
గత వారం,పది రోజులుగా కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో పాత్ర అంటూ ఆరోపణలు వస్తున్నటువంటి కవిత పై ఈ.డి విచారణ గురించి అలాగే టి ఎస్ పి ఎస్ సి పేపర్ లికేజీ వ్యహారం తో తెలంగాణ రాష్ట్ర (బి ఆర్ ఎస్) పాలన యొక్క నిజస్వరూపం క్యూ న్యూస్ ద్వారా స్కామ్ లు, దోపిడీ లు, దాడులు బయటపడుతుంది అనే నేపథ్యంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు క్యూన్యూస్ కార్యాలయం పై దాడి నిర్వహించారు అలాగే క్యూ న్యూస్ నడిపిస్తున్న తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్)ను అరెస్ట్ చేయడం దుర్మార్గం అని అన్నారు.
ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా లో చాలా పేపర్లు, మీడియా ఛానళ్ళు,లిక్కర్ స్కాం టి ఎస్ పీఎస్ సి పేపర్లు లీక్ పై రాసినారు. వారిని కూడా ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను అరెస్టు చేయలేదు.
కావాలనే కుట్ర పూరితంగా అరెస్టు చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు అయూబ్ ఖాన్,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నరసింహారావు,జిల్లా మైనారిటీ సీనియర్ నాయకులు ఖలీల్ ఖాన్,పిఏసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్,జిల్లా ఎస్సి సెల్ కార్యదర్శి కొండగొర్ల పోషయ్య,ఉపసర్పంచ్ కర్ల అరుణ, ప్రజా ప్రతినిధి ముక్కెర లాలయ్య ,మండల ఉపాధ్యక్షులు ఎండీ రియాజ్,మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సోదారి రామయ్య,పిఏసిఏస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,వర్కింగ్ టౌన్ అధ్యక్షులు సరికొప్పుల శ్రీనివాస్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సర్వ అక్షిత్,జిల్లా యూత్ కార్యదర్శి ఎండీ గౌస్,మండల యూత్ అధ్యక్షులు వసంత శ్రీనివాస్,టౌన్ యూత్ అధ్యక్షులు బండారు లక్కీ,జిల్లా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గద్దల నవీన్,మండల సోషల్ మీడియా ఇంచార్జి సోదారి హరీష్,మహిళా మండల అధ్యక్షురాలు కట్కూరి రాధికా,సీనియర్ నాయకులు సాధనపెళ్లి లక్ష్మయ్య,మామిడి రాంబాబు,తాళ్లపెల్లి నరేందర్,ముమ్మనేని రమేష్,సునార్కని శ్రీనివాస్,నేగారికంటి ముతేష్,ముద్రబోయిన రఘు, రాజేష్,ఉపసర్పంచ్ మహేష్,తూర్పటి కుమారస్వామి,ఈసం జనార్దన్, సోనప కిరణ్,వెంకటస్వామి,వలస తిరుపతి,గడ్డం మహేష్,వార్డ్ సభ్యులు పడిదల హనుమంతు,చిక్కుల మానస, నాగమణి,ఈసం వీరయ్య,కావిరి మొండయ్య,సోదారి పోషయ్య,జిమిడా రవి,కొండగొర్ల మోహన్, కుమ్మరి నర్సింహులు,ఇర్సవడ్ల కిరణ్, పాగ నాగరాజు,గికూరు భాగ్య,సిరాజ్,యూత్ నాయకులు ముస్తఫా,లక్ష్మణ్,ఖయ్యుమ్, సంపత్,నూతి లక్ష్మణ్,గణేష్,ఖుష్ కుమార్,నాగవత్ కిరణ్,జగన్, మనోహర్, సాంబ, జగన్, సద్దాం, అఖిల్,సర్వ సాయి,జిమిడా కళ్యాణ్,పెద్ది రాజబాబు,నాగవత్ కిరణ్,దుర్గం అర్జున్,కొండగొర్ల రాజేష్, పడిదాల లక్ష్మీనారాయణ,ఇర్సవడ్ల కిరణ్,గికూరు భాగ్య,అమృత,షాపెల్లి రాజేష్,నాగసాగర్,మౌలాన,సురేష్,ఠాగూర్,శ్రీకాంత్,ఎన్ యస్ యూ ఐ విద్యార్ధి నాయకులు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.