తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలి

తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందించాలి* ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి బి.భాస్కర్
టేకులపల్లి, ఏప్రిల్ 4( జనం సాక్షి ):  భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్,వరంగల్ తదితర జిల్లాల్లో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన ప్రతిరైతుకు నష్టపరిహారం చెల్లించాలని,అధికారులు తప్పుడు రిపోర్టులతో రైతులను మోసం చేయవద్దని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బి. భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో అఖిల భారత రైతు-కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడాల బిక్షపతి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా భాస్కర్ ప్రసంగిస్తూ ఇటీవల కురిసిన వర్షాల కారణంగా మొక్కజొన్న,పత్తి, మిర్చి, వరి పంటలు మామిడి తోటలు ఇతర పండ్ల తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టం జరిగి 20 రోజులు దాటుతున్న అధికారులు పంట నష్టాన్ని సర్వే చేసేందుకు పూనుకొనలేదని నిర్లక్ష్య వైఖరిన విడనాడి చిన్న,సన్నకారు  రైతులతోపాటు అన్నిరకాల పంటలను నష్టపోయిన రైతులందరికీ దరఖాస్తు చేసిన రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.ఏప్రిల్ 25,26,27 తేదీ లలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర మహాసభలు జరపనున్నట్లు ఈ మహాసభ లను జయప్రదం చేయాలని రైతు కూలీలకు భాస్కర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు రైతులతో చెలగాటం ఆడుతున్నాడని పోడుపట్టాలిస్తానని సంవత్సరాల తరబడి ఊరిస్తు న్నాడని ఆదివాసి గిరిజన పేద రైతులను మోసం చేసే వైఖరిన విడనాడి పోడు రైతులందరికీ పట్టాలి వ్వాలని ఆయన డిమాండ్ చేశారు.  సమావేశంలో ఉపాధ్యక్షులు మామిడాల బిక్షపతి, రాష్ట్ర సహాయ కార్యద