తెలంగాణపై ఏకాభిప్రాయం సాధ్యం కాదు: వీహెచ్
హైదరాబాద్: తెలంగాణపై వందేళ్లయినా ఏకాభాప్రాయం సాధ్యం కాదని కాంగ్రెస్ సీనియర్‌నేత వి.హనుమంతరావు అన్నారు. 2004లో తెరాసతో పొత్తుపెట్టుకునేందుకు అడ్డుచెప్పని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి అందరూ కట్టుబడివుండాలని ఆయన కోరారు.



