తెలంగాణపై నెలాఖరులోపు ప్రకటనకు అవకాశం లేదు: మధుయాష్కీ
ఢిల్లీ: తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని, నెలాఖరులోపు కేంద్రం నుంచి ప్రకటన వచ్చే ప్రసక్తే లేదని యాష్కీ అభిప్రాయపడ్డారు. ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే తెలంగాణ సాధ్యమని, తెలంగాణ మార్చ్‌ను కలిసికట్లుగా ఎలా నిర్వహించాలనే దానిపై ఆలోచించాల్సిన అవసరముందన్నారు. ఉద్యమ నిర్మాణం బాగంటేనే కేంద్రం దిగివస్తుందన్నారు.



