తెలంగాణపై భిన్నస్వరాలు వినిపించటం తగదు
హైదరాబాద్: తెలంగాణపై యూపీఏ భిన్న స్వరాలు వినిపించటంపై సీపీఐ మండిపడింది. రాజకీయపార్టీలను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి మాట్లాడుతుండగా కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇప్పట్లో అఖిలపక్షం సమావేశం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ శాసనసభాపక్ష నేత గుండా మల్లేష్ ఆరోపించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టడం వల్ల తనకేమీ తెలియదంటూనే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే నక్సలైట్లు పెరిగిపోతారని బాధ్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడటం మానుకోవాలని మల్లేష్ హితవు పలికారు.



