తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలి:కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ: తెలంగాణపై వెంటనే రాజకీయ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఢిల్లీలో ఆయన చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరింది. తెలంగాణలో ఆత్మబలిదానాలను కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తూనే ఉందని మరో నేత ఇంద్రసేనారెడ్డి అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించేవరకు భాజపా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.