తెలంగాణపై సీమాంధ్ర మీడియా విషప్రచారంపై మండిపడ్డ టీ అడ్వకేట్‌ జేఏసీ

హైదరాబాద్‌, జూలై 28 (జనంసాక్షి):
తెలంగాణ ఆంశంపై రాష్ట్రపతికి హోంశాఖ నివేధిక ఇచ్చిందని తెలంగాణ రావడం ఇక కల్లెనని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రచారంపై తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ మండిపడింది. ఏబీఎన్‌ కార్యాలయం ముందు హైకోర్టుకు చెందిన పలువురు న్యాయవాదులు ప్లాకార్డులతో నిరసన తెలిపారు. సీమాంధ్ర దురంకారి వేమూరి రాధకృష్ణా డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలుచేశారు. రాష్ట్రపతికి ఇచ్చిన రహస్య నివేదిక బహిర్గతం అయ్యే అవకాశమే లేదని తెలంగాణ ఆంశాన్ని పక్కదారి పట్టించేందుకు తప్పుడు రాతలు రాస్తున్నారని పెద్దపెట్టున న్యాయవాదులు నినాదించారు. సీమాంధ్ర మీడియా తెలంగాణపై విషప్రచారాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని వారు హెచ్చరించారు. అలాగే గవర్నర్‌ తివారినీ తప్పించడంలో ఏబీఎన్‌ ఆడిన నాటకాన్ని వికిలిక్స్‌ బయటపెట్టడాన్ని వారు ఉదహరించారు. సీమాంధ్రలావికి తెరవెనుక ఉప్పు అందిస్తున్న రాధకృష్ణకు తెలంగాణ ప్రజలు తగు విధంగా బుద్ది చెబుతారన్నారు.