తెలంగాణలో రహదారి భద్రత భేష్
ప్రభుత్వ చర్యలకు సుప్రీం కమిటీ సంతృప్తి
హైదరాబాద్,డిసెంబర్3 (జనంసాక్షి) : రహదారి భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల
సుప్రీం కోర్టు కమిటీ సంతప్తివ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదాలను నివారించడంతో పాటు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కమిటీ ఆదేశించింది. జస్టిస్ అభయ్ మనోహర్ సాప్రే అధ్యక్షతన రహదారి భద్రతపై ఏర్పాటైన సుప్రీం కోర్టు కమిటీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రహదారి భద్రత చర్యలను సవిూక్షించింది.
ఈసందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నిశాఖలతో ఈనెల 11వ తేదీన సమావేశమై రోడ్డు భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన చర్యలపై చర్చించనున్నట్టు కమిటీకి తెలిపారు.ఈ సమావేశంలో రవాణా,రోడ్డు , భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ, అడిషనల్ డీజీ జితేందర్, హూంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్త, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్‌ఎం రావు, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్‌ఇన్‌చీఫ్ గణపతిరెడ్డి , జాతీయ రహదారుల అధారిటీ రీజినల్ ఆఫీసర్ కష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.