తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ ఆది కళాకారుని ముచ్చెట్ల ఆత్మకత పింజారి

అడవి, పల్లె కలిసి ఆటకు, పాటకు పలుకు నేర్పిన యాల్ల కంచెల మొలిసిన చెట్లు పంట తీగ లు ఆత్మలు ఎల్లబోసుకున్న తీరు పల్లె కళాకారులు తల్లి ఒడి బర్సుకొని కూలికి కాలం ఎల్లబోసిన దినాలు కుల గాయకులు, జాతి వారసులు సుతిని మతిగ మలిసి బుడుమ తీగలకు అన్ప తీగలకు రాగాలల్లి శబ్దాన్ని ఇరుగ గాసిన తుమ్మ చెట్ల ముండ్లల్ల కాయలు గాయపడి ఎదుగు పొట్ట మీద కొత్త తోవను ఆవిష్కరించుకొని తుమ్మ ఒగరు కర్రెన మాగి కాలం తిరుగుట్ల గింజ కాయ కడు పుల ఎగుర్లాట నేర్చుకొని పాట గాలికి ముచ్చెట చెప్తుంది తొల్త. గప్పుడగని కూడు గుడ్డ నీడలేని ఇజ్జ కలిర్తి గాయకులు ఆకలిగాల్లకు పేగుపేగుకు ఒక సప్పుడోస్తుంది. అప్పుడుగని పిల్లాజెల్లా పెం డ్లం ఊరు ఎండిన సెర్వులు గత్తర్లగాల్లు వృత్తి కళా కారునికి కులిర్తి కళాకారునికి ఈ దేశం ఈ పెంప కం ఇక్కడ పుట్టు జీవులు మొత్తం కడుపు దెరిసి కనిపించన కూనలాగ దల్చుకొని తొల్త గ్రామ దేవ తల కాంచి గుళ్లు గోపురాలకింద ఎప్పుడూ నిద్ర బుచ్చుకున్నట్లు ద్యానం పేర్లతోని పూజారి గాయ త్రి మంత్రాలతోటి జనులను మొసాలతోటి జయి స్తు ఉంటారని అనుకుంటారు. కాని పట్నపోల్లకు నిజమే స్రృహ కలిగించి దేవాలయాలముందు బోక్కబోర్లపడి పోర్లుతూనే ఉంటరు. పూపజారి ఆనందిస్తడు. చరిత్ర లోపటికి పోదల్చుకోలేదు. అయ్య జనులారా! న్రగాయాలలో తట్టుబోసిన కాలం గాకున్నా ఊరి ప్రజలు అందరు కలిసి గ్రా మ దేవతలను కొలుస్తరు. కలుసుకునుండంటే మ ల్ల ఇక్కడొక తిర్కాసు గుడ ఉన్నది. ప్రధానంగా ఆరు వాడకట్లు ఉంటయ్‌. ఒక ఆడకట్టయితే శ్ర మ  దెల్వనివాళ్లు. గీల్లను మనుషులనుకోరు. మ నుషులకొచ్చే కష్టసుఖాలు తెల్వది వాళ్లకు. రెడ్డి, వెలమ, కోమటి, మున్నూరూ కాపు గీల్లకు పండు గలు పబ్బాలు గాటి పస తెల్వదు. మిగిలిన ఐదు వాడకట్లు సంబరాలు జేసుకుంటుంటే చూసి ఆనందించేటొల్లేగానీ ఈల్లు గల్వరు. ఇంకోక ఆడ కట్టు గూడ ఉంది.గది ఉన్నదని తెల్సి గుడ పట్టి చ్చుకోరు. అది గీ జంబుస్తాన్‌ జరుగుతన్న తంతు. జనానికి తెల్సిందే, గది తుర్కాడకట్టు. అది దాదా పు చివరి అంటరాని వాడ. మాదిగ వాడల్ల తిరు గుతున్నది. బత్కు జీవన విదానం ఒక్క తీర్గనే ఉం టది. కాని నైజం పాలించనప్పుడు ఆకర్న రజా కారు పోపకడల కింద జీవితం గడపడం తప్పా రారికం తెల్వని తుర్కలు కులిర్తితోని కాలం ఎల్లబు చ్చుకుంటరు. మిగిలిన విడకట్టున ఇల్లు గట్టుకు న్న, వాళ్లపక్కన జీవించాలనుకున్నా వాళ్లకు స్థానం లేదక్కడ. గట్లనే నైజం పాలించిన వారసులం, మాకేమి కొదువనుకొని ఇంక కొంచెం మాదిగాడ కట్టుకు పైకి జరిగి జీవితం గడుపుతున్రు. ఆచార వ్యవహారాల్లొ అంతా ఒకటైన హలాలని ఆచారం తిరిగి జొచ్చినప్పుడు దానికి లోబడి ముర్దార్‌ తిం టున్నరు, సచ్చిన గొడ్లను దింటున్నారని, ధేడ్‌ అఏ కాడికొచ్చింది. తుర్కోల్లు పాటిస్తున్నది నిజమే. రోగాలు, నొప్పులతోటి పశువులు సస్తే గా తున కలు తింటే రొగాలోస్తాయనేది నిజమే. సుతి దెల్వ ని జాతి ఒకటుంది. కాలాలు కొట్టుకుపోయి కరు వొస్తే కాగులల్ల బొక్కలు ఉడ్కబెట్టుకోని కడుపుకు దిని కాలం ఎల్లబుచ్చుకొనే కాలాలు గుడ ఉన్నై. గట్లనే యజమానికి  జీతాలుండి ఇంటినిండా గంపెడు పిల్లలు తినేటేల్లుండి మొగడు అప్పుకింద కుదువపెడితే కుటుంబానికి ఆడది కూలి కైకిలి జేసి ఎల్లదీస్తది. అదే తుర్కిండ్లల్ల మొగునిపై ఆధా రపడి ఉంటది. శ్రమకోర్చుకొని బోక్కలు, తోల్లు ,గాజులు, బట్టల మూటలెత్తుకొని అంగళ్లు తిరిగి సంసారం ఎల్లదీస్తరు. బర్కతు అన్న మాట గన్క వాడితే ఈ దేశంలో తుర్కోల్లు మిదటి వాళ్లుగా చెప్పుకోవాలే.గౌరవంగుడగట్లనేవచ్చిందనుకంట.

ఇంగబోతే అండ్లనే నాకు దెల్సిన కాడికి దూదేకుల పక్కీర్లు, వీల్లను ఇటు హిందువులు శత్రువులన్నకున్రు గాని అంటరాని కుటుంబంలో నీచులుగా జూస్తరు. కొన్నికొన్ని గ్రామాలలో వాళుమాదిగలుగ, మాదిగలు తుర్కలల్ల గల్సిన వాళ్లు దూదేకుల జాబితా కిందనే జేరుస్తరు. తుర్కోల్లు దూదేకులను, పక్కీర్లను ధేడోంక సాల అనే సామె త కొనసాగుతుంది. తుర్క దూదేకుల మాదిగల మాల ఉపకులాల విషయం మల్ల గిటువంటి సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. గట్లనే దళిత మేధావులు పెద్దపెద్ద పుస్తకాలు రాసి వ్యాసా లు రాసి దళిత అనే పదం అలుసైపోయే తీరుగా దొరుకని చర్చలు ముచ్చట్లు కష్టాలు మరిషి సుఖా లతో సంతోషమే దళిత ఎజెండా అయింది. సంతోషం సుఖం అటుంచి ఎనుక గొలుసు జాతి కులాలకు మేలెంత జరిగింది.

ఒక ఆదికళాకారుని గురించి చెప్పుకుం టున్నం గనుక చెప్పక తప్పదు. జర సుసాయించు కోరి. సిగ్గనిపంచే వ్యాసాలు, సదివిన పుస్తకాలు ఒకటి మాత్రం యాదికొస్తుంది. మన బటగం, మ న జాతి, కులం దళితన్నప్పుడు ఒక్క మేధావి నిజం నోరిప్పడు. షవ్వా ముడ్డి మూసుకుంటే ఆస న నోట్లేకొస్తే బాగుండు. గప్పటికైనా ఆసన విలువ తెలుసు. అంటరాని ఆత్మల గురించైన తెలుసు. ఇంతకు మొదలు జెప్పదలుసుకున్నదేంటని అను కోవచ్చు అద్దం  మొఖం ముందలే ఉంది. అద్దం మాట్లాడదు. నోరు మాట్లాడ్తది. నరం లేని నాలికె నానా మాటలంటది. నరాలతో నిర్మితమైన  మన సున్నది. నిజం దానికి తెలుసు. కొండంత రాగం దీసి పిట్ట గుళ్లె పాట పాడినట్లుందా? అవును పుట్టు గుడ శాన చిక్కులతో కూడుకున్నది. పాట గుడ షిక్కులల్ల అల్లుకున్నది. గీ షిక్కు ఇప్పగలడా ఎవడన్నా? పాట, లయ గొంతున్నవాడె ఇప్ప గలడు. వాడే వీడు. ఇన్ని షిక్కులిప్పుకుని ఇన్ని దొంతరాలు దాటి స్వయాన తన నోటితోని షిక్కు ముడులపై నాట్యమాడినాడు. అవ్వతోడు గిది దూదేకుల నాజరు ముచ్చెట్ల ఆత్మకత. గీ షిక్కు ఇనాలె మరి.

మెదట అంగడాల వెంకట్రమణ మూర్తి ఎంత ఆనందించిండో కొంత పొరపాటు గుడ జరిగిందని నా అభిప్రాయం. ఆ రోజు నా రాత బాగాలేక అని మొదలుబెట్టి ఏ రాగాలు అంటరు మీ లీలతో అని అడిగిండు నాజర్ని.  అది ప్రశ్న కానేకాదు. ఎందుకంటే నాజరంటే ఏందో ఆయన బతుకేందో తెలిసి ఉండాలె సంకలనకర్తకి. తెల్వ కుంటే ఆ ప్రశ్న రాదని జగమెరిగిన సత్యం. గట్లనే నాజరు చెప్పిన తీరు కథకుడు ఎవరైన సరె వేది కెక్కి పరిచయం జేసుకుంటారు. ఊరి పరిపాల కులు కమ్మవాడైన పటేల్‌ పట్వారి కులపెద్దలు ఊరి కాపలకారులు పురప్రజలు సౌఖ్యమేనా అని వంతకకాళ్లను అడగటం జరుగుతుంది. అట్లనే నాజరన్న మాటలివి, జూద్దాం నిజాయితీ పాలెం తుందో తెలుస్తుంది. ‘శ్రీమంతులకు సేద్యవంతు లకు చేతివృత్తుల జనాలకు సిరులు సెరిగే పంట పొలాలకు అభయమిస్తూ ఊరికి పడమట హద్దున కొండకింద పొన్నకాయంత కళ్లున్న తల్లి జడలమ్మ గుడికి ఈశాన్యాన ఊరందరికి ప్రాణాధారమైన మంచినీళ్లబాయి కనుచూపులో ఊరిమధ్యన ఒకనాటి జమిందారు వాసిరెడ్డి వెంకటాద్రినాయు డు ప్రతిష్టించిన నూటొక్క శివలింగాల ఆలయం చుట్టూ అష్టకష్టాల, అష్టఐశ్వర్యాల అష్టవర్ణాలు అలరారు ఈ ఊరు గుంటూరు ఉత్తర దిశనున్న పొన్నెకల్లు’

పొన్నెకల్లు తూర్పువీధి దూదేకుల సాయెబుల పందిరి గుంజ కూడ పాటపాడుతుందని పేరు. ఇట్లా నాజరుకథను మెప్పించేవాడి మాట సత్యం గుంటది. అదే జేసిండు నాజరు. అట్ల పొన్నెకల్లు కుగ్రామాన్ని వర్ణిస్తడు నాజరు. ఊరు, ఆ ఊరిల ఉన్నటువంటి వాడల గురించి చెప్తడు. అంటె ఊర్లె వాడకట్లను అప్పుడే ఎరిగినవాడు. కనుక రెడ్డి, కమ్మ, సూద్ర మాదిగ, మాల, తర్క దూదే కుల పక్కీర్ల వాడకట్లని లెక్క కట్టినవాడు. ఇది ము మ్మాటికి నిజమే పోన్నెకల్లును వర్ణించడం జూస్తె అంబేడ్కరంత ఆలోచనపరుడుగా కన్పిస్తడు నాజ రు. ఇప్పటి దళిత మేధావులు పంచమ మేధావు లని నువ్వా నేనా జెప్పిందని గిప్పుడు పంచాతి బెట్టుకుంటున్రు. ఒక్కసారి నాజరు జెప్పిన జోలి గమనించి తీరాలి. ఎనిమిది వర్గాలు, ఎనిమిది వర్ణాలంటడు. నేను ఆ పందిరికిందే పుట్టాను. ఎప్పుడంటె సిద్దాద్రి నామ సంవత్సరం 1920 ఫిబ్రవరి 5 వ తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు ముఖ నక్షత్రాన బుట్టాను అని తల్లి బీబాబీ, తండ్రి షేక్‌ మస్తాన్‌లకు బుట్టిన్నని జన్మ గురించి వివరిస్తడు.

-వేముల ఎల్లయ్య

స్కైబాబ

ఇంకావుంది…