తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 13th

తరువాత కాలంలో కొనసాగుతూ వచ్చింది. నిజాము పాలన చివరి పది సంవత్సరాలలో తీవ్ర నిర్భంధాన్ని, అణచివేతను అమలు జరిపింది. తన కు వెన్నుదన్నుగా ఉంటారనుకున్న భూస్వామ్యవ ర్గం క్రమంగా జాతీయోద్యమం వైపు చూడడం, బ్రిటిష్‌ ప్రభుత్వం తనను అనాధగా వదిలి వెళ్లబో తున్న భయం, జాతీయోద్యమం మీద ఉన్న అను మానం, జిన్నాను కూడా నమ్మలేని తనం-ఇటు వంటి అనేక పరిస్థితుల మధ్య ఏడో నిజాం రజా కార్లమీదా పోలీసు బలగాల మీదా ఆధారపడవల సిన స్థితిలో పడ్డారు. నిజాం వ్యవహారసరళికి కూ డా రాజకీయ అర్థాలుంటాయని గుర్తిస్తే,శుష్క వ్యతిరేకత కాక, హేతుబద్దమైన అంచనాలు సాద్య మవుతాయి. బ్రిటిష్‌ ఇండియాలో నిషేదం ఉన్న కాలంలో హైదరాబాద్‌ రాజ్యంలో కమ్యూనిస్టుల మీద నిషేదం లేదు. కోస్తా ఆంధ్ర నాయకత్వంలో తెలంగాణాలోకి అడుగుపెట్టిన కమ్యూనిస్టులను బ్రిటిష్‌ ఇండియా ఏజెంట్లుగానే నిజాం చూశాడు. ఎస్పుడైతే కమ్యూనిస్టులు భారత ప్రభుత్వంతో కూడా పొరాడారో, అప్పుడే వారితొ సంధి చేసు కోవడానికి ఉబలాటపడ్డాడు. స్వతంత్ర కారణం. అటువంటి కంటగింపు ను కమూనిస్టులు కూడా పంచుకొవడం ఆశ్చర్యకరం.
నిజాం పాలన 1948 సెపెంబరు 17తో అంత మయిందని భావిస్తూ ఉంటారు.అయితే నిజాం ప్రభుత్వానికి కుదిరిన ‘ యధాతథ ‘ ఒడంబడిక ప్రకారం మీర్‌ ఉస్మాన్‌లీఖాన్‌ ఆంధ్రప్రదేశ్‌ అవత రణ వరకు హైదారాబాద్‌ రాష్ట్రానికి ‘ రాజ్‌ ప్రము ఖ్‌’ గా వ్యవహరించారు. ఈ విషయాన్ని మాట వరుసకు కూడా ఎవ్వరూ పేర్కనడం లేదు. 1952 మార్చి 23న హైదారాబాద్‌ శాసన సభను ప్రారంభించింది ఆయనే. నిజాం ప్రభువు 24 ఫిభ్రవరి వ, 1967న మరిణించాడు. అయితే అంతకు రెండు రోజుల ముందే మృతి చెందిన ట్లుగా తప్పుగా ‘వార్తా సంస్థలు ‘ష్లాష్‌న్యూస్‌’ వెలు వరించాయి. దీనికి సవరణ మాత్రం ఆయన మరణించిన 24 గంటల తర్వాత ప్రకటించారు. ఇలా ఆయన బతికుండగానే చంపేసిన మీడియా ఇన్నాళ్లు కు కూడా ఆయనకు దక్కాల్సినన కీర్తిన కూడా దక్కకుండా చేస్తోంది. నిజాం శవయాత్ర లొ జనం కనీవిని ఎరుగని రీతిలొ లక్షలాదిగా పా ల్గొన్నారు. ఆయన మీద ప్రజలకు ఎంత అభిమా నముండేదొ ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది శాసనసభలలో నిజాంకు సంతాపం ప్రకటిస్తూ కారగ్రెస్‌ తొ పాటుగా రిపబ్లికన్‌ పార్టీ కమ్యూనిసు ్టలు,జన సంఘ్‌లు ఆయన సేవలకు కొనియాడారు తెలంగాణ సాయుధ పొరాటంలో పాల్టొన్న కమ్యూనిస్టు యోదుడు , కవి మగ్దుం మొహియుద్దీ న్‌ సంతాపం ప్రకటిస్తూ ఏడొ నిజాం రాసిన కవిత్వాన్ని సేకరించి ప్రచురించాలని సూచించాడు అలాగే హైదారాబాద్‌ పై పొలిసు చర్య అనంత రం ఉస్మానలీ – సర్దార్‌ వల్లబాయి పటేల్‌కు హైద రాబాద్‌ లో స్వాగతం పలికే ఫొటొ కు విశేష ప్రచారం కల్పించిన ‘మీడియా ‘,నెహ్రు ,జయంత్‌ నాథ్‌ చౌదరీ లతో కలిసి దిగిన గ్రూప్‌ ఫొటోకు గుర్తింపు లేకుండా చేశారు. ఇదంతా ఒక పథకం ప్రకారం నిజాం ఆత్మాభిమానం అణగదొక్కడంగా చూడాలి. నిజాం కారుమీద బాంబుల వేసిన నారాయణ పవార్‌ని పత్రికల ప్రతి యేడాది ఇంట్వార్యులు చేసి ప్రచురిసున్నాయి. కానీ , హైద రాబాద్‌ చర్రితరలొ ఉజ్వల ఘట్టాలైనా 1857 గురించి ఏ పత్రికా ప్రచురిసున్నాయి.1859 మా ర్చి 15వ బ్రిటిషు రెసిడెంట్‌ పై ‘బందూక్‌ ‘ పేల్చి న నవాబ్‌ షమ్సుల్‌- ఉమ్రా మనవడు జహంగీర్‌ ఖాన్‌ని అది మిస్సయి ,దొరికిపొయి ప్రాణలర్పిం చిన ఆయన అమరత్వాన్ని స్మరించాలి. బ్రిటీషు రెసిడెన్సీ మీద దాడిచేసి, ఆ తరువాత బ్రిటీషు సైనికుల చేతిలొ హతుడైనా తుర్రెబాజ్‌ ఖాన్‌ పేరు తాంతియా తొపే పేరులాగా అందరికీ తెలి యవలిసిన పేరు లాగా అందరీకీ తెలియవలిసిన పేరు .1933-48 మధ్య న పౌరహక్కుల కల్పించి న అడ్డంకిన, గస్తీ నిషాన్‌ – 53 నిబంధన తొ ప్రజల హక్కుల హననంపై నిజాం ప్రభుత్వానికి ధోరణి వదులుకోవాలి.నిజాం హయంలో జరిగిన అభివృద్ధి విస్మరించే ఒంటికన్ను దృష్టిని సవరించు కొవాలి.
1908 లొ మూసి నదికి వరదలు వచ్చి అటు షాలిబండ నుంచి ఇటు ఉస్మాన్‌గంజ్‌ వరకు మొ త్తం నగరం కొట్టుకుపొయింది. గంగమ్మ తల్లి కి కొపం వచ్చింది, ‘అమ్మ’ ను శాంతింపజేయా లని పూజారుల కొరగా ఆరొ నిజామ్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ స్వయంగా గాజుల,పసుపు కుంకుమలు పళ్ళెంలొ పట్టుకుని, పట్టు వస్త్రాలు ధరించి మూ సినదిలో అర్పణం చేయడం జరిగింది. పాలకు డిగా ప్రజల విశ్వాసాలను గౌరవించారు. పాటిం చారు. కూడా అలాంటి మహబూబ్‌ గురించి నేటి బాలలకు పాఠ్యపుస్తకాల ద్వారా తెలియకుండా చేశారు. ఏడొ నిజాం తాను కారులో ప్రయాణించే ప్పుడు తన గురువు ప్రొఫెసర్‌ వెంకటశాస్త్రి ఎదు రుపడితే కారు దిగి సలామ్‌ చేసే సంస్కారవం తుడు.హైదరాబాద్‌ నగర ప్రజలకు ఇప్పటికీ తాగే నీళ్లందిసున్న ఉస్మాన్‌ సాగర్‌ ,హిమాయిత్‌ సాగర్‌ తటాకాలను ఉస్మానలీఖాన్‌ ప్రభుత్వమే తవ్వించిం ది. అభివృద్ది పనులు కావా ఇవి? నిజాం సాగర్‌ ప్రాజెక్టు రికార్డు స్థాయులొ పూర్తి చేయించాడు. ఆయన కట్టించిన అజాంజాహీ మిల్స్‌, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలనుభ్రష్టు పట్టించిన ఇప్పటి ప్రభు త్వం ఆనాటి మేటి కళాశాల ఆలియా కాలేజ్‌ను కూడ అమ్ముకో జూస్తుంటే ఒక్కరూ ఖండించరేం? ఉద్యమాలు లేవదీయరేం? నిజాం సోమ్ము కోట్లకు కోట్లు విరాళంగా బుక్కిన ఆంధ్రా యూనివర్సిటి ఏనాడూ ఆయనను స్మరించదేం? అంతెందుకు కొందరు నేతలు ఏకంగా నిజాం కళాశాల మైదా నంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసుకూంటూ అదే వేదిక నుంచి నిజాం ఈ రాష్ట్రానికి ఏమి చేయ్యలేదని చెబుతుంటారు. కనీసం తాము మాట్లాడుతున్నది నిజాం కట్టించిన 100 ఏళ్ల పురాతన కళాశాల ఆవరణ నుంచి అనే అవగా హన కూడ వారికుండదు. నిజాంని తిట్టిపోయ డంలో అంతర్లీనంగా ముస్లిమ్‌ జాతి వ్యతిరేకత కూడ అందులో ఉందని గమనించాలి. తెలంగాణ సాయుద పోరాటంలో ప్రాణాలోడ్డిన అమర వీరుడు దొడ్డి కొమురయ్య గురించి రాసినంత చరి త్ర దాదాపు అంతే ప్రాధాన్యత ఉన్న షేక్‌ బందగీ గాధ గురించి ఏ కొద్దిమందికొ తప్ప తెలియదు. ఇదంతా తెలిసి చేసినా తెలియక చేసిన ఒక వీరు ని మరణానికి గుర్తింపు లేకుండా పోయిందనేది నిజం.
హిందూ-ముస్లిమ్‌ సంస్కృతి, మైత్రి చరిత్రలో చివరిస్థాయిగా ఉన్నాయి. వాటిని నేటితరం గుర్తించినట్లు నటిస్తోంది. ఎప్పుడూ మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌, హుజుర్‌నగర్‌లను పాత పేర్ల తో పిలవాలని రభస చేసే హిందూత్వ వాదులు ఏడో నిజామ్‌ ఉస్మానలీఖాన్‌ తాను స్వయంగా ‘ఛెటాన్‌పల్లి’ కి షాద్‌నగర్‌ అని పేరు పెట్టాడని గ్రహించాలి.1930వ దశకంలో కొత్తగా వేసిన రైల్వేలైనును పరీశీలిస్తు ఉస్మానలీఖాన్‌ మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని ‘ఛెటాన్‌పల్లి’ కి వచ్చాడు. అక్కడు న్న స్టేషన్‌ మాస్టరుతో ఈ ఊరిపేరేంటని అడి గాడు. ఆయన ‘ఛెటాన్‌పల్లి’ అని సమాధానమిచ్చా డు.రాళ్లపల్లె పేరు బాగా లేదని తన మంత్రి కిషన్‌ పర్‌షాద్‌ జాగీరు గ్రామం కావడంతో ఆయన పేర నే’షాద్‌నగర్‌’ అని నామకరణం చేశాడు. ఈ విష యం ఎక్కడా రికార్డు కాలేదు. నిజాం ప్రధానిగా ఉన్న కిషన్‌ పర్‌షాద్‌ కొడుకు పేరు ఖాజా అర్జున పర్‌షాద్‌. అజ్మీర్‌ బాబకు మొక్కుతో పుట్టినందున ఆయనకు ఖాజా అర్జున్‌ పర్‌షాద్‌ అని పేరు పెట్టు కున్నాడు. అలాగే ప్రఖ్యాత కమ్యూనిస్టు నాయకు లు రాజబహదూర్‌ గౌర్‌ సొదరుడి పేరు ‘మహ బూబ్‌ నారాయణ్‌’ ఈయన ఆ కాలంలో గౌలిపు రాలో ఉంటూ సంఘసేవ చేసేవారు. హైదరా బాద్‌ సంస్కృతిలో భాగమైన ఇలాంటి పేర్లకు రాజ కీయల్ని అంటగట్టి ఒంటికంటితో చూసే అలవా టు మానుకుంటే మంచిది. ఆనాటి పేర్లు ఈనా డెంతో అపభ్రంశం చెందాయి.’ఈర్రం మంజిల్‌’ పేరిట ఖైరతాబాద్‌లో గల నవాబులబిల్డింగ్‌లో ప్రస్తుతం నీటిపారుదల శాఖ కార్యాలయలు నడు స్తున్నాయి. అయితే దాని అసలు పేరు కాస్తా తెని గీకరించబడి ‘ఎర్రమంజిల్‌’ గా మారింది. విషయ మిదని చెబితే నమ్మే నాథుడు కూడా లేడు. అలాగే ఇసామియ బజార్‌లోని రెసిడెంట్‌ నివాసాన్ని ‘కోఠి’ అని పిలిచేవారు. ఇప్పుడు అది కాస్తా ‘కోటి’ అయింది. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి.
సురవరం ప్రతాపరెడ్డి లాంటి సుప్రసిద్ద జర్న లిస్టు పరిశోదకుడు, రచయిత తాను బతికున్నంత కాలం ప్రభుత్వ అన్యాయాలను ఖండిస్తు తన పత్రి క ద్వారా ప్రతిపక్ష పాత్ర పోషించాడు. అయితే 1990లలో సురవరం ప్రతాపరెడ్డి సాహిత్య వైజ యంతి వారు ఆయన ఆయన రచనలు సంపుటా లుగా వెలువరించేందుకు నిజాం చారిటబుల్‌ ట్ర స్టు వారు ఉదారంగా విరాళాలిచ్చారు. ఇక్కడే ఇదారే-అదబియాత్‌ -ఉర్దూ సంస్థ తెలుగు సాహి త్యానికి చేసిన సేవను చెప్పాలి. బిరుదురాజు రామరాజు సంపాదకత్వంలో ‘ఖుతుబ్షాహి సుల్తా నులు ఆంధ్ర సంస్కృతి అనే బృహత్‌ గ్రంథాన్ని 1962 లో వెలువరించారు. ఇందులో ఖుతుబ్షాహీ ల సాహిత్య పోషణ, ందుకూరి రుద్రకవి, సారుం గు తమ్మయ, అద్దంకి గంగాధరకవి, నేబతి కృష్ణ యామాత్యుడు మొదలైనవారి వివరాలున్నాయి. అలాగే తెలుగులో మొట్లమొదటి అచ్చతెలుగు కావ్యము ‘యాయాతి చరిత్ర’ రాసిన పొన్నగంగి తెలగనార్య, ప్రథమాంద్ర యక్షగాన రచయిత ందుకూరి రుద్రకవి ఇద్దరూ ఖుతుబ్షాహీల ఆద రణ పోదారనే విషయాన్ని గమనించాలి. తెలుగు సాహిత్యానికిఖుతుబ్షాహీలు ఇంత సేవ చేస్తే దాన్ని చరిత్రకారులు అంధకారయుగంగా పేర్కోంటారు. ఈ దుర్నీతిని ఇప్పటికైన ఖండించాలి. ఖుతుబ్షాహీ లు క్షేత్రయ్య ప్రతిభను మెచ్చి ఆయనకు మొవ్వ క్షెత్రాన్ని దానంగా ఇచ్చారు. అలాగే అసఫ్‌జాహీ లు అజంతా ఎల్లోరా గుహలను రక్షించడంలో చూపిన శ్రద్ద ఎన్నటికి మరువలేనిది. ఇంతటి చారిత్రక కట్టడాల రక్షణకు ప్రస్తుత ప్రభుత్వాలు, ఆర్కియాలజీ శాఖ వారు అరకోర చర్యలు చేపడు తుంటే అనాడే నిజాం ప్రభువులు కొన్ని కోట్ల రూపాయలతో వాటి పరిరక్షణకు ఏర్పాట్లు చేశారు అలాగే విదేశీ చిత్రకారులను రప్పించి నకళ్లు చే యించారు. ప్రఖ్యాత చిత్రకారుడు, రచయిత అ యిన అడివి బాపిరాజు, రాంభట్ల కృష్ణమూర్తి చేత ఎల్లోరా పెయింటింగ్స్‌కు నకళ్లు తయారు చేయిం చారు. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే అబివృద్దిలో భాగంగా రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇదారె అదబియత్‌ చారిత్రక కట్టడాన్ని కూలగొట్టడానికి సన్నద్దులయ్యరు. అయితే పత్రికల వాళ్లు హైదరా బాద్‌ కట్టడాలు, సంస్కృతిపై మక్కువ ఉన్నవాళ్లు దాని రక్షణకు ఉద్యమించడంతో ప్రస్తుతానికి ఆ ముప్పు తప్పింది. అయితే ఇందుకోసం తెలుగు పత్రికలు ఎక్కడా ఒక్క ముక్క రాసిన పాపాన పోలే దు. ఒక మతానికి సంబంధించిన కట్టడంగా కా కుండా మొత్తం హైదరాబాద్‌ సంస్కృతిలో భాగం గా ఇదారె అదబియాత్‌ని గుర్తించే ‘సంస్కారం’ లేకుండా పోయింది. ఉర్దూ కేవలం భాషగా మార్చబడుతున్న కుట్రలో గతంలో తెలుగువారు వెలువరించిన ఉర్దూ సాహిత్యం కూడ కనుమరు గయింది.
-వేములఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది..