తెలంగాణ కోసం శంకర్రావు మౌనదీక్ష
హైదరాబాద్: తెలంగాణ ప్రకటించాలని కోరుతూ మాజీ మంత్రి శంకర్రావు మౌనదీక్షకు పూనుకున్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని దీక్షలో కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.



