తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాట్‌) ఏర్పాటు

హైదరాబాద్‌ : తెలంగాణలోని పది జిల్లాల్లో క్రికెట్‌ అభివృద్ధి కోసం క్రికెట్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (క్యాట్‌) పేరిట నూతన సంఘం ఆవిర్భవించింది. ఈ నూతన సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘాల జేఏసీ నేత విఠల్‌, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్‌ నేత ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సంఘం ఏర్పాటుతో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెక్‌ పెట్టడమే కాకుండా సీమాంధ్రు పెత్తనానికి అడ్డుకట్ట వేసినట్టయింది. హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంలో తమ తెలంగాణ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతోందని, స్థాణిక ఆటగాళ్లకు అవకాశాలు దక్కడం లేదని ఆరోపిస్తూ తెలంగాణకు చెందిన వివిధ పార్టీల నాయకులు క్యాట్‌ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.