తెలంగాణ ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి ఉంటే..

రాష్ట్రపతి ఎన్నికలను బహిష్కరించండి
తెలంగాణ ఉద్యోగ జేఏసీ డిమాండ్‌
హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి): తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశానికి చాటిచెప్పేందుకు రాష్ట్రపతి ఎన్నికలు చక్కటి అవకాశమని, తెలంగాణ కాంగ్రెస్‌ పజాప్రతినిధులకు రాష్ట్రం ఏర్పాటు విషయంలో చిత్తశుద్ది ఉంటే ఎన్నకలు బహిష్కరించాలని తెలంగాణ ఉద్యోగసంఘనేత విటల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం 610 జీవో అమలు, సకల జనుల సమ్మె కాలంలో ఇచ్చిన హామీలపై జస్టిస్‌ రాయకోటి కమీషన్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్‌ అదిష్టానం స్పష్టమైన వైఖరి చెప్పకుండా తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకుంటుందనీ, తెలంగాణ ఆకాంక్షను దేశానికి చాటిచెప్పేందుకు ఇదే చక్కటి సమయాన్ని, తెలంగాణ నేతలు రాష్ట్రపతి ఎన్నికలు బహిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, ఆరునూరైనా మా తెలంగాణ మాకు కావాలన్నారు. 610 జీవోను, సమ్మె కాలంలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఈ నెల7న సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.