తెలంగాణ మేదరి విద్యార్థి సంక్షేమ సంఘం – రాష్ట్ర అధ్యక్షునిగా మహేశ్‌

చొప్పదండి,మే 26 : తెలంగాణ మేదరి (మహేంద్ర) విద్యార్థి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా చొప్పదండి మండల కేంద్రానికి చెందిన మొలుమూరి మహేశ్‌ నియామకమయ్యారు. తన నియామకానికి సహకరించిన ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కో కన్వీనర్‌ కటకం శ్రీధర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మొలుమూరి మహేశ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు తన వంతు పాటుపడతానని, అంతేకాకుండా మేదరి విద్యార్థులంతా ఉద్యమంలో భాగస్వాములను చేస్తానన్నారు. అలాగే సంఘాని బలోపేతానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటానని, అందులో భాగంగానే కమిటీలు వేస్తానన్నారు.