తెలుగు మహాసభలను విజయవంతం చేయాలి: సీఎం
హైదరాబాద్: తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు మహాసభలు సజావుగా సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. ఇవాళ జూబ్లీహాలులో తెలుగు మహాసభల నిర్వహణపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 1975లో మొదటి సారిగా తెలుగు మహాసభలు జరిగాయని, 22 ఏళ్ల తర్వాత తిరుపతిలో జరగనున్న మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు.



