తేదేపా నేతలను అడ్డుకున్న పోలీసులు

గుంటూరు: తెనాలిలో రాష్ట్ర పురపాలక శాఖామంత్రి మహీదర్‌రెడ్డి బస చేసిన ట్రావెల్స్‌ బంగ్లాను తేదేపా నేతలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది. తెనాలిలో కూరగాయల మార్కెట్‌ ప్రారంభకార్యక్రమానికి మంత్రితో పాటు స్పీకర్‌ నాదెండ్ల, మనోహర్‌ హాజరయ్యారు. ఈ సందర్బంగా కృష్ణా డెల్టాకు నీటి విడుదల కోరుతూ తేదేపా నేతలు మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించారు. పోలీసులు తేదేపా నేతలను మంత్రి వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ నేతృత్వంలో తేదేపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలపై మంత్రి, స్పీకర్‌ స్పష్టమైన ప్రకటన చేసే వరకూ కదిలేది లేదని తేదేపా ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మనోహర్‌, ఆలపాటి వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.