తైక్వాండో బృందం గిన్నిస్‌ రికార్డు

సోమాజిగూడ : నగరానికి చెందిన పదహరు మంది తైక్వాండో బృందం శిక్షకుడు జయంత్‌రెడ్డి అధ్వర్యంలో గంట సమయంలో 20,494 కిక్స్‌ కోట్టి గిన్నిస్‌ రికార్డు సాదించారు. గతంలో ఐర్తాండ్‌లోని కోబ్‌ మార్షల్‌ అకాడమీ ఈ రికార్డు సాదించింది. త్వరలో ఇదే బృందంతో కలిసి 30,000 కిక్స్‌ కోట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు శిక్షకుడు తెలిపారు. భవిష్యత్‌లో పాఠశాలలు, కళాశాలల్లో ఉచిత అవగాహన సదస్సులు ఏర్పాటుచేయనున్నట్టు వారు పేర్కోన్నారు.