త్వరితగతిన ఇంటిపన్నులు వసూలు చేయాలి

గుంటూరు, జూలై 8 : పంచాయతీలో ఇంటి పన్ను వసూలు చేస్తేనే ఆయా గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. నకరికల్లు మండల పరిషత్‌ కార్యాలయంలో పంచాయతీల పాలనపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారులు పగ్గాలు చేపట్టినా ఇంటి పన్ను వసూలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు పన్నులు చెల్లించాలని కోరారు. ఇంటి పన్ను వసూల్‌ ఆధారంగా మిగిలిన గ్రాంటులను ఆయా పంచాయితీలకు మంజూరు చేస్తానని ఆయన చెప్పారు. తాగునీటి ఎద్దడిపై ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులతో సమీక్షించారు. కోటి రూపాయల నిధులతో మండలంలో పంచాయతీలలో సిమెంట్‌ రహదారులను నిర్మించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంపిడిఓ బూసిరెడ్డి, తహశీల్దార్‌ సి.మోహనక్రిష్ణ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు రాఘవరెడ్డి, ఆర్‌డి అప్పల వెంకటేశ్వర్లు తదితులు ఉన్నారు.