దత్తత పిల్లలను ప్రయోజకులను చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 5 : శిశు గృహం నుండి దత్తత తీసుకున్న పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ఆడిటోరియం ప్రజావాణి కార్యక్రమంలో పిల్లలు లేని వెంకటరమణ, పావని దంపతులకు శిశు గృహంలోని అమృత అనే (7నెలల) పాపను జేసి చేతుల మీదుగా దత్తత ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాప పోషణ, రక్షణతో పాటు కన్న బిడ్డకన్న ఎక్కువగా చూసుకోవాలని సూచించారు. దత్తత చట్టపరమైనదని అన్నారు. జిల్లాలో పిల్లల కోసం దత్తత తీసుకునుటకు 52 మంది దంపతులు దరఖాస్తులు గలవని అన్నారు. సీనియార్టి ప్రకారం దత్తత ఇస్తామని ప్రస్తుతం శిశు గృహంలో తొమ్మిది మంది పిల్లలున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ రాములు తదితరులు పాల్గొన్నారు.